దేశంలో ఎక్కడా లేనంతగా ఫించన్లు:ఎర్రబెల్లి

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఇవాళ ఉభయ సభల్లో సాధారణ చర్చ జరుగుతోంది.

Updated : 22 Mar 2021 12:10 IST

హైదరాబాద్‌: తెలంగాణ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా ఇవాళ ఉభయ సభల్లో సాధారణ చర్చ జరుగుతోంది. ప్రశ్నోత్తరాల్లో భాగంగా అసెంబ్లీలో శాసనసభ్యుల ఆసరా పింఛన్లపై లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమాధానం ఇచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా ఆసరా పింఛన్లు అందజేస్తున్నామని ఎర్రబెల్లి శాసనసభలో వెల్లడించారు. భాజపా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వయసులతో పాటు అనేక నిబంధనలు పెట్టినా పింఛన్లు రూ.750 మించడం లేదన్నారు. ఆసరా పింఛన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది కేవలం రూ.210 కోట్లు అని.. అందులోనూ 6 లక్షల మందికే వర్తిస్తోందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ఆసరా పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.11,724.70 ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. కొత్త వారికి కూడా పింఛన్లు ఇచ్చే అంశం పరిశీలనలో ఉందన్నారు. 
ఏప్రిల్‌ నెలాఖరు వరకు గడువు: కేటీఆర్‌

హైదరాబాద్‌లో నల్లా మీటర్ల దరఖాస్తులకు ఏప్రిల్‌ చివరి వరకు గడువు పొడిగిస్తున్నట్లు పురపాలక మంత్రి కేటీఆర్‌ శాసనమండలిలో ప్రకటించారు. ఉచిత తాగునీటి సరఫరాపై మండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. మరో 50 ఏళ్లు దృష్టిలో ఉంచుకొని తాగునీటి వ్యవస్థల ఏర్పాటు చేసినట్లు వివరించారు. నీటి సంరక్షణలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు.

దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు ఉంటున్నాయని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌ కారిడార్‌ ఏర్పాటు విషయంలో కేంద్రంపై ఆయన విమర్శలు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని