National Herald case: ఈడీ నుంచి మాకెలాంటి నోటీసులు రాలేదు: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో నోటీసులు అందుకున్నారంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు

Published : 23 Sep 2022 12:46 IST

హైదరాబాద్‌: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో నోటీసులు అందుకున్నారంటూ వస్తున్న వార్తలపై తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. ఈ కేసుకు సంబంధించి తమకు ఎలాంటి నోటీసులు రాలేదని నలుగురు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేశారు. ఇప్పటివరకు తమకు ఈడీ నుంచి నోటీసులు అందలేదని మాజీ మంత్రులు షబ్బీర్‌ అలీ, గీతారెడ్డి, సుదర్శన్‌ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌లు తెలిపారు. పార్టీ విరాళం కింద డబ్బులు ఇచ్చింది వాస్తవమేనని వారు తెలిపారు. అయితే, చెక్కుల రూపంలో విరాళం ఇచ్చామని.. అందులో తప్పేంలేదని వారు స్పష్టం చేశారు. ఈడీ నుంచి నోటీసులు వస్తే తప్పకుండా విచారణకు హాజరవుతామని కాంగ్రెస్‌ నేతలు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని