Telangana News: మేడారం జాతరకు ఏమివ్వకుండా.. అమ్మవార్ల చెంత విమర్శలా?: ఎర్రబెల్లి

మేడారం జాతరకు ఏమీ చేయకుండా ఇక్కడికి వచ్చి అమ్మవార్ల చెంత రాజకీయ విమర్శలు ఏంటని భాజపా నాయకులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు.

Updated : 19 Feb 2022 14:22 IST

ములుగు: మేడారం జాతరకు ఏమీ చేయకుండా ఇక్కడికి వచ్చి అమ్మవార్ల చెంత రాజకీయ విమర్శలు ఏంటని భాజపా నాయకులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. కుంభమేళాకు రూ.325కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. అతి పెద్ద ఆదివాసీ జాతరకు కేవలం రూ.2.5 కోట్లు ఇవ్వడం ఏంటని నిలదీశారు. గిరిజనులంటే చులకన వల్లే ప్రధాని మోదీ, అమిత్‌షా, ఇతర కేంద్ర మంత్రులు మేడారానికి రావడం లేదని విమర్శించారు. మేడారంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు.

‘‘మేడారం జాతర విజయవంతమైంది. ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించాం. జాతరపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపారు. అధికారులు చక్కని సమన్వయంతో పని చేశారు. అన్నిశాఖల ఉద్యోగులకు అభినందనలు. దాదాపు 1.30కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా. కరోనా వల్ల జాతర ఎలా జరుగుతుందో అని భయపడ్డాం’’ అని మంత్రులు అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని