‘దళిత బంధు’ హుజూరాబాద్‌కు మాత్రమే కాదు: భట్టి

తెలంగాణలో ‘దళిత బంధు’ అనేది ఒక్క హుజూరాబాద్‌కు మాత్రమే కాదని.. రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ఒక్క హుజూరాబాద్‌కే

Updated : 20 Jul 2021 17:12 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ‘దళిత బంధు’ అనేది ఒక్క హుజూరాబాద్‌కు మాత్రమే కాదని.. రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ఒక్క హుజూరాబాద్‌కే అయితే ఎన్నికల కోసమే అన్నట్లు చూడాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద భట్టి మీడియాతో మాట్లాడారు. ఈనెల 22న ‘చలో రాజ్‌భవన్‌’ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దేశంలో ఫోన్‌ ట్యాపింగ్‌పై భట్టి మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఆందోళన కలిగిస్తోందన్నారు.

‘‘దేశంలో భావ స్వేచ్ఛ లేకుండా పోతోంది. ఫోన్‌ కాల్స్‌ ట్యాప్‌తో ప్రజాస్వామ్యానికి రక్షణ కరవైంది. దీని ద్వారా వ్యక్తులకు భద్రత లేకుండా పోతోంది. ఈ వ్యవహారంపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పాలి. ట్యాపింగ్‌ చేసే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలకాలి’’ అని భట్టి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని