TS News: ధాన్యం గురించి కేసీఆర్‌ ధర్నా చేయలేదా?: భట్టి విక్రమార్క

రైతు సమస్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇవాళ ఎర్రవెల్లిలో తలపెట్టిన ‘రచ్చబండ’ కార్యక్రమానికి

Updated : 27 Dec 2021 11:25 IST

హైదరాబాద్: రైతు సమస్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇవాళ ఎర్రవెల్లిలో తలపెట్టిన ‘రచ్చబండ’ కార్యక్రమానికి వస్తున్న కాంగ్రెస్‌ నేతలను అరెస్టు చేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన చేస్తే అడ్డుకుంటారా అని నిలదీశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెరాస నిరంకుశ పాలనను ప్రజలు గమనించాలని కోరారు. పోలీసు నిర్బంధంతో భావ వ్యక్తీకరణను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ధాన్యం గురించి ఇందిరాపార్క్‌ వద్ద కేసీఆర్‌ ధర్నా చేయలేదా అన్ని నిలదీశారు. తెరాసకు ఒక న్యాయం? విపక్షాలకు మరో న్యాయమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస ధర్నాలను పోలీసులు ఎందుకు అడ్డుకోవట్లేదని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని