AP News: బద్వేలులో భాజపా విజయానికి పని చేస్తాం: నాదెండ్ల మనోహర్‌

కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో భాజపా విజయం కోసం పని చేస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ చెప్పారు.

Updated : 09 Oct 2021 15:07 IST

అమరావతి: కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో భాజపా విజయం కోసం పని చేస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. భాజపాతో తాము పొత్తులో ఉన్నందున ఆ ధర్మాన్ని పాటిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆయన విమర్శించారు. ఒంగోలులో సీఎం పర్యటన కోసం సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తూ సభ ఏర్పాటు చేశారని మనోహర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సభకు రావాలని వాలంటీర్లతో మహిళను బెదిరించారని ఆయన మండిపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని