Mallikarjun Kharge: లూటీ చేసి దోస్తులకు పంచిపెట్టడమే మోదీ పనిగా పెట్టుకున్నారు: ఖర్గే

ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం రూ. 6 లక్షల కోట్ల నిధుల సమీకరణ కోసం జాతీయ సంపదను అమ్మేస్తున్నారని రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దీని...

Updated : 03 Sep 2021 17:33 IST

హైదరాబాద్‌: ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం రూ. 6 లక్షల కోట్ల నిధుల సమీకరణ కోసం జాతీయ సంపదను అమ్మేస్తున్నారని రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దీని ద్వారా సామాన్యులకు, దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఇప్పటికే రూ. 3.50 లక్షల కోట్ల విలువైన ఆస్తులను అమ్మేశారని ధ్వజమెత్తారు. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. వ్యాపారం వృద్ధి చెందితే దేశ సంపద పెరుగుతుందని.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం ద్వారా మిశ్రమ ఆర్థిక వృద్ధి జరుగుతుందని నెహ్రూ భావించినట్లు చెప్పారు.

ప్రభుత్వ రంగ సంస్థల్లో దాదాపుగా 35 లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. పబ్లిక్ సెక్టార్‌, బ్యాంకింగ్, రైల్వే, బీమా రంగాలకు చెందిన సంస్థలను అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడం ద్వారా రిజర్వేషన్లు పూర్తిగా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని పరోక్షంగా రిజర్వేషన్లు ఎత్తేసే పనిలో పడ్డారని విమర్శించారు. 1991లో పీవీ నరసింహారావు విదేశీ పెట్టుబడులను ఆహ్వానించినా పబ్లిక్ సెక్టార్‌ను ఇబ్బంది పెట్టలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంపదను కాపాడితే భాజపా నేతలు అమ్మేస్తున్నారని మండిపడ్డారు. పబ్లిక్ సెక్టార్‌ను లూటీ చేయడం.. దోస్తులకు పంచి పెట్టడమే మోదీ పనిగా పెట్టుకున్నారని ఖర్గే ఎద్దేవా చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని