Pawan kalyan: తూర్పుగోదావరి జిల్లాలో పవన్‌ పర్యటనపై ఉత్కంఠ

శనివారం తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. పవన్‌ శ్రమదానానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. కరోనా...

Updated : 01 Oct 2021 19:43 IST

రాజమహేంద్రవరం: శనివారం తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. పవన్‌ శ్రమదానానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. కరోనా వల్ల అనుమతివ్వట్లేదని జనసేనకు పోలీసులు స్పష్టం చేశారు. మరో వైపు పవన్‌ పర్యటన దృష్ట్యా పలుచోట్ల రహదారులకు మరమ్మతులు చేస్తున్నారు. కాటన్‌ బ్యారేజీపై గుంతలు పూడ్చారు. అనంతపురం జిల్లాలో కూడా శనివారం పవన్‌ పర్యటనకు అనుమతి లభించలేదు. పవన్‌ రాకముందే అనంతపురం జిల్లా కొత్త చెరువు రోడ్లకు మరమ్మతులు చేపట్టారు. పోలీసులు అనుమతి ఇవ్వకున్నా పవన్‌ పర్యటిస్తారని జనసైనికులు చెబుతున్నారు. 

జనసేన సభకు అనుమతిలేదు: అదనపు ఎస్పీ లతామాధురి

‘‘హుకుంపేట పంచాయతీ బాలాజీపేట సెంటర్‌లో బహిరంగసభకు జనసేన పార్టీ నేతలు అనుమతి అడిగారు. సుమారు 20వేల మంది సభకు తరలివచ్చే అవకాశం ఉంది. కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. బాలాజీపేట ప్రాంతంలో అంతమందితో సభ నిర్వహించడం వల్ల ఇబ్బందులు వస్తాయి. సభావేదిక మార్చుకోవాలని ఇప్పటికే జనసేన పార్టీ ప్రతినిధులకు సూచించాం. వారి నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. బాలాజీపేటలో అయితే సభకు అనుమతివ్వలేదు. జనసేన తరఫున శ్రమదానానికి అనుమతి కోరలేదు’’ అని రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ లతామాధురి మీడియాకు తెలిపారు. 

వేదిక మార్చిన జనసేన

ఏపీలో రోడ్ల పరిస్థితికి నిరసనగా పవన్‌ కల్యాణ్‌ శనివారం చేపట్టనున్న శ్రమదానం కార్యక్రమం వేదిక మారింది. నిరసన కార్యక్రమాన్ని తొలుత రాజమహేంద్రవరంలోని కాటన్‌ బ్యారేజీ వద్ద నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ జలవనరుల శాఖ అధికారులు అనుమతి నిరాకరించడంతో వేదికను హుకుంపేటలోని బాలాజీపేటకు మార్చారు. బాలాజీపేట కనకదుర్గమ్మ గుడి వద్ద సభ అనంతరం రోడ్డుపై పవన్‌ శ్రమదానం చేయనున్నారని జనసేన నేతలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని