ap News: గన్‌ మెన్లు వద్దన్నమాట వాస్తవమే: వంగవీటి రాధా

తనకు గన్‌మెన్లు వద్దన్నమాట వాస్తవమేనని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత వంగవీటి రాధా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... 

Updated : 28 Dec 2021 19:47 IST

విజయవాడ: తనకు గన్‌మెన్లు వద్దన్నమాట వాస్తవమేనని మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత వంగవీటి రాధా స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తిని అందుకే గన్‌ మెన్లు వద్దన్నా అని వివరించారు. తన క్షేమంపై అన్ని పార్టీల నేతలు ఫోన్‌ చేసి అడిగారని చెప్పారు.

 తనను చంపేందుకు కొందరు రెక్కీ నిర్వహించారంటూ రాధా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని సీఎం జగన్‌ను కలిసి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం నాని మీడియాతో మాట్లాడుతూ.. రాధాకు 2 ప్లస్‌ 2 గన్‌మెన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు. వెంటనే భద్రత కల్పించాలని ఇంటెలిజెన్స్‌ డీజీకి ఆదేశించారన్నారు. రాధాపై ఎవరు రెక్కీ చేశారో దర్యాప్తు జరపాలని ఆదేశించారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని