Revanth Reddy: రాహుల్‌పై అసోం సీఎం వ్యాఖ్యలు.. రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు: రేవంత్‌

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్నాయని 

Updated : 13 Feb 2022 14:00 IST

హైదరాబాద్‌: అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాతృత్వాన్ని కించపరిచేలా అసోం సీఎం మాట్లాడారన్నారు. అతని వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డాలు స్పందించకపోవడం దారుణమని రేవంత్‌రెడ్డి అన్నారు.

రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు. రేపు రాష్ట్రంలోని పీఎస్‌లలో బిశ్వశర్మపై ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు సంబరాలను వాయిదా వేస్తున్నట్లు రేవంత్‌ చెప్పారు. సీఎం కేసీఆర్‌ మాటల్లో చిత్తశుద్ధి ఉంటే అసోం సీఎంపై కేసు నమోదు చేయించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని