‘ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మహిళలపై ఈ దాడులు’

యూపీలోని గోండ జిల్లాలో ముగ్గురు బాలికలపై యాసిడ్‌ దాడి జరగడాన్ని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. ఈ విషయమై ఆమె యూపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. యోగి ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు.

Updated : 17 Aug 2022 15:54 IST

దిల్లీ: యూపీలోని గోండా జిల్లాలో ముగ్గురు బాలికలపై యాసిడ్‌ దాడి జరగడాన్ని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. ఈ విషయమై ఆమె యూపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. యోగి ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ఆమె యాసిడ్‌ బాధిత బాలికల తండ్రి మాట్లాడిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ పేర్కొన్నారు. ‘యోగి హయాంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. యూపీ ప్రభుత్వం మహిళలపై నేరాలకు పాల్పడుతున్న వారిని రక్షించి, సమర్థిస్తున్న వైఖరే నిందితులకు ధైర్యంగా మారుతోంది’అని ఆరోపించారు. యూపీలోని గోండా జిల్లాలో ఇంటి కప్పుపై నిద్రిస్తున్న ముగ్గురు బాలికలపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్‌ దాడి చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరికి స్పల్పంగా కాలిన గాయాలయ్యాయి. ఒకరికి ముఖంపై తీవ్ర గాయాలు కావడంలో పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు ముగ్గురూ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఫోరెన్సిక్‌ బృందం ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శైలేష్‌ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని