Vidadala Rajini: ఓటు హక్కు కోసం మంత్రి విడదల రజిని తప్పుడు చిరునామా!

ఓటు హక్కు కోసం మంత్రి విడదల రజిని (Vidadala Rajini) తప్పుడు చిరునామా ఇచ్చారు. గుంటూరులో ఖాళీ స్థలం చిరునామాతో మంత్రి దరఖాస్తు చేసుకున్నారు.

Updated : 04 Jan 2024 17:43 IST

గుంటూరు: ఓటు హక్కు కోసం మంత్రి విడదల రజిని (Vidadala Rajini) తప్పుడు చిరునామా ఇచ్చారు. గుంటూరులో ఖాళీ స్థలం చిరునామాతో మంత్రి దరఖాస్తు చేసుకున్నారు. ఆమె ఇచ్చిన చిరునామాలో అపార్ట్‌మెంట్ ఉన్నట్లు పేర్కొన్నారు. దీనిపై తెదేపా నేతలు అభ్యంతరం తెలిపారు. బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేశారని ఆరోపించారు. మంత్రి రజినికి గుంటూరులో ఓటు హక్కు ఇవ్వొద్దని అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఇప్పటికే చిలకలూరిపేట పరిధిలోని పురుషోత్తమపట్నంలో ఆమె ఓటు ఉందని తెదేపా నేతలు చెప్పారు. 

విడదల రజిని ప్రస్తుతం చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవల ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వైకాపా నియమించింది. ఈ నేపథ్యంలోనే రజిని గుంటూరులో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని