Yanamala Ramakrishnudu: అప్పులతో కొనసాగే సంక్షేమ రాజ్యం కూలిపోక తప్పదు: యనమల

 జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రం అప్పుల పాలవుతుందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు.

Published : 06 Apr 2024 22:50 IST

విజయవాడ: జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే.. రాష్ట్రం అప్పుల పాలవుతుందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం రెండో రోజునే జగన్‌.. ఆర్బీఐ నుంచి రూ.4 వేల కోట్లు అప్పు తీసుకొచ్చారని మండిపడ్డారు. బహిరంగ మార్కెట్‌లో జగన్ రెడ్డి ప్రభుత్వం రోజుకు రూ.257 కోట్లు చొప్పున మొత్తం రూ.93,805 కోట్లు అప్పులు చేసిందని దుయ్యబట్టారు. శాసనసభకు చెప్పి చేస్తామన్న అప్పులు రెండింతలయ్యాయని విమర్శించారు. రాబోయే ప్రభుత్వాల అప్పులను సైతం జగనే చేయాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే 2024-25 ఆర్థిక సంవత్సరం అప్పుల్లో రూ.20వేల కోట్లు జూన్4 లోపే చేసేయాలని కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని కాపాడుకోవాలంటే జగన్‌ రెడ్డిని ఓడించాల్సిందేనని పిలుపునిచ్చారు. అప్పులతో కొనసాగే సంక్షేమరాజ్యం ఎప్పటికైనా కూలిపోక తప్పదని హెచ్చరించారు. పేదలను సుస్థిరాభివృద్ధి వైపు నడిపించాలంటే అభివృద్ధితో కూడిన సంక్షేమం అందించే కూటమిని గెలిపించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని