Yanamala: ప్రభుత్వానివి చందమామ కథలు.. సీఐడీవి చిలకపలుకులు: యనమల

రాష్ట్రంలో అన్ని రంగాలు కుదేలవుతుంటే.. ఆధారాలు లేని స్కామ్‌ల పేరుతో సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.

Updated : 24 Sep 2023 11:30 IST

మంగళగిరి: రాష్ట్రంలో అన్ని రంగాలు కుదేలవుతుంటే.. ఆధారాలు లేని స్కామ్‌ల పేరుతో సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. అర్ధాంతరంగా అరెస్టు చేసి, కోర్టుల ముందు అబద్ధాలు పెట్టి తెదేపా అధినేత చంద్రబాబు నిర్బంధాన్ని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. రైతు ఆత్మహత్యలు, నిత్యావసర ధరలు, పన్నుల భారం, నిరుద్యోగం, ఎయిడెడ్ విద్యాసంస్థల మూసివేత.. ఇవేవీ జగన్ ప్రభుత్వానికి కనపడవా? అని ప్రశ్నించారు.

సీఎం జగన్‌ అన్నీ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొన్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో తమ పరిపాలనను, తప్పులను ఎవరు ప్రశ్నించరాదనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా హయాంలో ఏనాడు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరిగిన దాఖలాలు లేవని విమర్శించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధం ఉన్న నీలం సహాని, అజెయ కల్లాం, ఐవైఆర్ కృష్ణారావులను ఎందుకు విచారించడం లేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం చందమామ కథలు అల్లుతూ సీఐడీ చేత చిలకపలుకులు పలికిస్తోందని యనమల విమర్శించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని