Andhra News: ఎంపీ గోరంట్ల రూపంలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ: యరపతినేని

అధికారంలోకి రాకముందు అమరావతే రాజధాని అన్నారు.. అధికారం చేపట్టిన తర్వాత మూడు రాజధానులు అని అంటున్నారని తెదేపా నేత యరపతినేని శ్రీనివాస్‌ వైకాపా..

Updated : 06 Aug 2022 17:27 IST

మంగళగిరి: అధికారంలోకి రాకముందు అమరావతే రాజధాని అన్నారు.. అధికారం చేపట్టిన తర్వాత మూడు రాజధానులు అని అంటున్నారని తెదేపా నేత యరపతినేని శ్రీనివాస్‌ వైకాపా ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యరపతినేని మీడియాతో మాట్లాడారు.

‘‘కిందిస్థాయి నాయకుల నుంచి సీఎం వరకూ ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల ప్రజలను గౌరవించే సంస్కృతిని అలవర్చుకోవాలి. ఎన్టీఆర్‌ చిన్న కుమార్తె మృతిపై విమర్శలు చేసే పరిస్థితి రావడం దురదృష్టకరం. ఆమె మరణాన్ని కూడా రాజకీయం చేశారు. కక్షతోనే కొన్ని వర్గాలకు మంత్రివర్గంలో చోటు లేకుండా చేశారు. కుల, మత రాజకీయాలను సీఎం జగన్‌ పెంచి పోషిస్తున్నారు. మహిళలను వేధిస్తూ దొరికిపోయిన ఎంపీ.. ఓ వర్గాన్ని నిందిస్తారా? వైకాపాకు గోరంట్ల రూపంలో గట్టి ఎదరుదెబ్బ తగిలింది. వైకాపా ప్రభుత్వానికి మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నా.. వెంటనే ఎంపీ గోరంట్ల మాధవ్‌ను సస్పెండ్ చేయాల్సిందే. పార్టీ నుంచి బహిష్కరించాలి. దుర్గామాతలుగా మారి రాష్ట్రాన్ని మహిళలే కాపాడుకోవాలి. చేతిలో అధికారం ఉంది కదా అని అహంకారంతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. వారు అంతా గమనిస్తున్నారు. ఏదో ఒక రోజు ప్రజలు సరైన సమాధానం చెబుతారు. వైకాపాకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉంది’’ అని వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని