YS Sharmila: వైకాపాకి ఓటేస్తే.. ఈసారి ప్రజల్ని అమ్మేస్తారు: షర్మిల

 వైకాపాకి మరోసారి ఓటు వేస్తే ప్రజల్ని కూడా అమ్మేస్తారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. 

Published : 15 Apr 2024 18:52 IST

పలమనేరు: వైకాపాకి మరోసారి ఓటు వేస్తే ప్రజల్ని కూడా అమ్మేస్తారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన జగన్‌.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని ప్రశ్నించారు. కుంభకర్ణుడైనా ఆరు నెలలకు ఒకసారి నిద్ర లేస్తాడు కానీ, జగన్‌ మాత్రం నాలుగున్నర సంవత్సరాల తర్వాత నిద్ర లేచి.. ఎన్నికల ముంగిట హడావుడిగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారని అన్నారు. ఈ ప్రక్రియ ఎలాగూ పూర్తవ్వదని ఆయనకు తెలుసని, కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో షర్మిల మాట్లాడారు.

మద్యపాన నిషేధమంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌.. ప్రభుత్వమే మద్యం అమ్మే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు. నాసిరకం మద్యం అమ్ముతూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. వైకాపా పాలనతో రైతులు అప్పులపాలయ్యారన్నారు. సామాజిక న్యాయం అంటూ ఊదరగొడుతున్న జగన్‌.. అమ్మ ఒడిలో కోతలు ఎందుకు పెట్టారని నిలదీశారు. ఒక్క బిడ్డకే అమ్మఒడి ఇస్తే.. రెండో బిడ్డను ఎలా చదివించుకుంటారని షర్మిల ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని