విధి విచిత్రం: ఒక రోజే అత్యధికం, అత్యల్పం!

క్రికెట్‌లో రికార్డులు నమోదవ్వడం సాధారణమే. అయితే ఒకేరోజు రెండు విభిన్న ఘనతలు చోటుచేసుకోవడం అరుదైన విషయం. డిసెంబర్‌ 19న టీమిండియా రెండు రికార్డులు సృష్టించింది. అందులో గర్వంగా చెప్పుకునేది ఒకటి ఉంటే, మరిచిపోవాలని కోరుకునేది మరొకటి. 2016,

Published : 20 Dec 2020 01:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రికెట్‌లో రికార్డులు నమోదవ్వడం సాధారణమే. అయితే ఒకేరోజు రెండు విభిన్న ఘనతలు చోటుచేసుకోవడం అరుదైన విషయం. డిసెంబర్‌ 19న టీమిండియా రెండు రికార్డులు సృష్టించింది. అందులో గర్వంగా చెప్పుకునేది ఒకటి ఉంటే, మరిచిపోవాలని కోరుకునేది మరొకటి. 2016, డిసెంబర్‌ 19న ఇంగ్లాండ్‌పై సాధించిన స్కోరు.. భారత క్రికెట్‌ టెస్టు చరిత్రలోనే అత్యధిక స్కోరుగా నమోదైంది. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లోని‌ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన ఏడు వికెట్లు కోల్పోయి 759 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. కరుణ్‌ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించగా, కేఎల్ రాహుల్ (199) ద్విశతకానికి పరుగు దూరంలో ఔటయ్యాడు. ఈ పోరులో టీమిండియా‌ ఇన్నింగ్స్‌ 75 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సరిగ్గా నాలుగేళ్ల తర్వాత టీమిండియా మరో రికార్డు నమోదు చేసింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి డే/నైట్ టెస్టులో ఎవరూ కోరుకోని చెత్త రికార్డు ఖాతాలో వేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే పరిమితమై భారత టెస్టు చరిత్రలో అత్యల్ప స్కోరు చేసింది. హేజిల్‌వుడ్‌, కమిన్స్‌ ధాటికి భారత బ్యాట్స్‌‌మెన్‌ కనీసం ఒకరు కూడా రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. ఫలితంగా భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే 2016, డిసెంబర్‌ 19న ఘనమైన రికార్డు సాధించిన కోహ్లీసేనే.. 2020, డిసెంబర్‌ 19న పేలవమైన రికార్డు నమోదచేయడం ‘విధి ఆడే వింత నాటకం’గా అనిపిస్తోందని నెటిజన్లు పోస్ట్‌లు చేస్తున్నారు.

ఇదీ చదవండి

ఓటీపీని మరిచిపోవాలి

పెద్ద జట్లు.. చిన్న స్కోర్లు: ఎందుకీ విలవిల?

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని