కోహ్లీ స్థానంలో సెహ్వాగ్‌ ఉంటే..?

టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగి భారత్‌కు చేరుకున్నాడు. సతీమణి అనుష్క శర్మ వచ్చేనెలలో తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే...

Updated : 24 Dec 2020 11:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్ ‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన నుంచి భారత్‌కు చేరుకున్నాడు. సతీమణి అనుష్క శర్మ వచ్చేనెలలో తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడు పితృత్వపు సెలవులు తీసుకున్నాడు. అయితే, తొలి టెస్టులో భారత్‌ ఘోర పరాజయం పాలైన తర్వాత అతడిలా తిరిగి వచ్చేయడంపై చాలా మంది విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌కు కోచ్‌గా వ్యవహరించిన‌ ఏఎన్‌ శర్మ సైతం కోహ్లీ చేసింది మంచిది కాదంటున్నారు.

కోహ్లీ స్థానంలో తన శిష్యుడు వీరూ ఉంటే కచ్చితంగా క్రికెట్‌కే తొలి ప్రాధాన్యం ఇచ్చేవాడని, ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వచ్చేవాడు కాదని ఓ క్రీడా ఛానల్‌తో అన్నారు. కోహ్లీ వంటి ఆటగాడు తిరిగి రావడం తనకు నచ్చలేదని చెప్పారు. జట్టుతోనే ఉండి ఆస్ట్రేలియాతో పోరాడాల్సిందని అభిప్రాయపడ్డారు. మరోవైపు టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ దిలీప్‌ దోషి సైతం ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. కోహ్లీ స్థానంలో తానుంటే కచ్చితంగా దేశం తరఫున ఆడేందుకే తొలి ప్రాధాన్యం ఇచ్చేవాడినని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆటగాళ్లను ఆపేందుకు బీసీసీఐకి ఎటువంటి అధికారాలు లేవని, కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితులను తాను అర్థం చేసుకుంటానని అన్నారు. అయితే.. వ్యక్తిగతంగా తాను మాత్రం జట్టుతోనే ఉండేవాడినని స్పష్టం చేశారు. 

భారత్‌ ఇప్పటికే తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ తర్వాత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ భారత్‌కు చేరుకున్నాడు. ఇక శనివారం నుంచి ప్రారంభమయ్యే ‘బాక్సింగ్‌డే టెస్టు’లో భారత్‌ ఎలా ఆడనుందో వేచి చూడాలి. 

ఇవీ చదవండి..
2020.. కోహ్లీ ఏంటి?
సన్నీ×అనుష్క..రోహిత్×కోహ్లీ..బంగ్లా ‘అతి’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని