విలియమ్సన్‌ను వెనక్కినెట్టి కోహ్లీ ముందుకు

ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. బ్యాటింగ్‌ జాబితాలో న్యూజిలాండ్ సారథి కేన్‌ విలియమ్సన్‌ను టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ వెనక్కినెట్టి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు..

Updated : 15 Dec 2020 20:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. బ్యాటింగ్‌ జాబితాలో న్యూజిలాండ్ సారథి కేన్‌ విలియమ్సన్‌ను టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ వెనక్కినెట్టి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అంతకుముందు వీరిద్దరు 886 రేటింగ్‌ పాయింట్లతో రెండో ర్యాంక్‌ను పంచుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన ర్యాంకుల్లో విలియమ్సన్‌ 877 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్ (911) అగ్రస్థానంలో ఉన్నాడు. టాప్-10లో భారత్‌ తరఫున కోహ్లీతో పాటు చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె కూడా ఉన్నారు. 766 రేటింగ్ పాయింట్లతో పుజారా ఏడో స్థానంలో, 726 పాయింట్లతో రహానె పదో స్థానంలో నిలిచారు.

బౌలింగ్‌ విషయానికొస్తే జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్‌ ఒక ర్యాంక్‌ను మెరుగుపర్చుకున్నారు. బుమ్రా 779 రేటింగ్ పాయింట్లతో ఎనిమిదో స్థానం, అశ్విన్‌ 756 పాయింట్లతో పదో స్థానంలో ఉన్నారు. ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్‌ (904), ఇంగ్లాండ్‌ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ (845) తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక ఆల్‌రౌండర్‌ జాబితాలో జడేజా మూడో స్థానంలో, అశ్విన్‌ ఆరో స్థానంలో కొనసాగుతున్నారు. కాగా, టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. స్వల్ప పాయింట్ల తేడాతో ఆస్ట్రేలియా, కివీస్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆసీస్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో టీమిండియా విజయం సాధిస్తే తమ ర్యాంక్‌ను మెరుగుపర్చుకుంటుంది.

ఇదీ చదవండి

అభిమానులకు శుభవార్త: యువీ రీఎంట్రీ

అతడు లేకపోయినా బలంగానే ఉన్నాం: రహానె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని