IND vs NEP: నేపాల్ ఆటగాళ్లను సర్‌ప్రైజ్‌ చేసిన టీమ్‌ఇండియా ప్లేయర్స్‌..

ఆసియా కప్‌లో భాగంగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా (Team India) 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం భారత్ ఆటగాళ్లు నేపాల్ (Nepal) ప్లేయర్స్‌ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి సర్‌ప్రైజ్‌ చేశారు.

Published : 05 Sep 2023 16:31 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌లో భాగంగా పసికూన నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సూపర్‌-4కు దూసుకెళ్లింది. అయితే, టీమ్‌ఇండియా (Team India) తో నేపాల్‌కు ఇది తొలి అంతర్జాతీయ మ్యాచే అయినా గట్టి పోటీనిచ్చింది. బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోయినా బ్యాటర్లు సత్తాచాటారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 230 పరుగులు చేశారు. అనంతరం వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించి భారత్ లక్ష్యాన్ని 145గా నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. అయితే, మ్యాచ్‌ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు నేపాల్ ప్లేయర్స్‌ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఆ జట్టు ఆటగాళ్లతో కాపేపు ముచ్చటించారు. టీమ్‌ఇండియా ఆటగాళ్లతో నేపాల్‌ ప్లేయర్స్ ఫొటోలు దిగారు.

అనుకున్నట్లే ఆ ముగ్గురికీ దక్కని చోటు.. వన్డే ప్రపంచ కప్‌నకు భారత జట్టు ఇదే..

అనంతరం విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ మ్యాచ్‌లో రాణించిన నేపాల్ ఆటగాళ్లకు మెడల్స్‌ అందించారు. జట్టు స్కోరు 200 దాటడంలో కీలకపాత్ర పోషించిన సోంపాల్ కామిని హార్దిక్ పాండ్య అభినందించి మెడల్ అందించాడు. లోయర్‌ ఆర్డర్ బ్యాటర్ అయిన సోంపాల్ 56 బంతుల్లో 48 పరుగులు చేశాడు. అర్ధ శతకం బాదిన ఆసిఫ్‌ షేక్‌ను కోహ్లీ అభినందించి కొన్ని విలువైన సలహాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నేపాల్ క్రికెట్ అసోసియేషన్ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు