IPL 2024: చెన్నై సూపర్‌ కింగ్స్‌.. సీజన్‌ మొత్తానికి స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం

ఐపీఎల్‌ 2024 (IPL 2024) సీజన్‌ నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. డిసెంబరు 19న వేలం నిర్వహించనున్నారు. 

Updated : 23 Nov 2023 20:29 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2024 (IPL 2024) సీజన్‌ నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. డిసెంబరు 19న ఆటగాళ్ల వేలం (IPL Auction) నిర్వహించనున్నారు. అయితే, ఈ సారి భారత్‌ ఆవల వేలం నిర్వహిస్తారని సమాచారం. దుబాయ్‌ వేదికగా ఆటగాళ్ల వేలం ఉంటుందని పీటీఐ పేర్కొంది. రిటైన్‌ చేసుకునే ఆటగాళ్ల జాబితాను నవంబర్ 26 లోగా అందజేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ స్పష్టం చేసింది. ఆ లోగా జట్లు ఆటగాళ్లను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది. 

బెన్‌స్టోక్స్‌ దూరం 

ఐపీఎల్‌ 2024 సీజన్‌ మొత్తానికి చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings) ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ (Ben Stokes) దూరంగా ఉండనున్నాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్, ఫిట్‌నెస్‌ కారణాలతో అతడు ఈ సీజన్‌కు అందుబాటులో ఉండడని సీఎస్కే ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఐపీఎల్‌ కంటే ముందు భారత్‌తో ఇంగ్లాండ్ ఐదు టెస్టులు ఆడనుంది. ఐపీఎల్ సీజన్‌ ముగిసిన అనంతరం టీ20 ప్రపంచకప్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే అతడు ఈ ఐపీఎల్‌ సీజన్‌కు దూరంగా ఉంటున్నట్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేర్కొంది. 

ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌ రాయల్స్‌, లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ జట్లు ఆటగాళ్లను మార్చుకున్నాయి. రాజస్థాన్‌ ఓపెనర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌.. లఖ్‌నవూకు వచ్చాడు. లఖ్‌నవూ పేస్‌ బౌలర్‌ అవేష్‌ ఖాన్‌ రాజస్థాన్‌ జట్టుకు మారాడు. అవేష్‌ను 2022 సీజన్లో లఖ్‌నవూ రూ.10 కోట్లకు కొనుక్కుంది. అదే సీజన్లో పడిక్కల్‌ను రూ.7.75 కోట్లకు రాజస్థాన్‌ కొనుగోలు చేసింది. అదే ధరలకు ఇప్పుడు వేరే జట్ల సొంతమయ్యారు. మరోవైపు, ఫామ్‌లో లేని మనీష్‌ పాండే, సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌లను దిల్లీ క్యాపిటల్స్‌ తమ జట్టు నుంచి విడుదల చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని