Virat Kohli: కోహ్లీ లాంటి ఆటగాడు విఫలమైనా ఫర్వాలేదు: వార్నర్

టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీ లాంటి అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ విఫలమైనా ఫర్వాలేదని, అందుకు అతడు పూర్తి అర్హత కలిగిన వాడని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్...

Published : 08 Jan 2022 13:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా టెస్టు సారథి విరాట్‌ కోహ్లీ లాంటి అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ విఫలమైనా ఫర్వాలేదని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. కోహ్లీ గత రెండేళ్లుగా సరిగ్గా బ్యాటింగ్‌ చేయలేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ‘బ్యాక్‌ స్టేజ్‌ విత్‌ బోరియా’ అనే ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన వార్నర్‌ ఇలా చెప్పుకొచ్చాడు.

‘కోహ్లీ లాంటి ఆటగాడు విఫలమైనా ఫర్వాలేదు. ఎన్నో ఏళ్ల నుంచి అత్యుత్తమ ఆట ఆడుతున్న ఆటగాడు ఇప్పుడు విఫలమవ్వడం అర్థం చేసుకోదగిన విషయమే. అందుకు అతడు పూర్తి అర్హత కలిగినవాడు. స్టీవ్‌స్మిత్‌ కూడా గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సెంచరీ చేయలేదు. కానీ, అతడు ప్రతి నాలుగు ఇన్నింగ్స్‌లకు ఒక శతకం బాదుతాడని గణాంకాలు చెబుతున్నాయి. కొన్నిసార్లు కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని అర్థం చేసుకోవచ్చు. అందుకే వారిపై అధిక ఒత్తిడి ఉంటుందని అనుకుంటున్నా’ అని వార్నర్‌ వివరించాడు. కాగా, ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న విరాట్‌ ఈసారైనా రాణిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరి కోహ్లీ రాణిస్తాడా.. లేదా? అనేది చూడాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని