DCw Vs UPw: దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌.. బ్యాటింగ్ ఎంచుకున్న యూపీ వారియర్స్

మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో మరో అద్భుత మ్యాచ్‌కు వేళైంది. దిల్లీ-యూపీ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Published : 08 Mar 2024 19:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే యూపీ వారియర్స్‌ విజయం సాధించాల్సిన అవసరం.. మరోవైపు అగ్రస్థానంతో నాకౌట్‌ దశకు చేరుకోవడానికి దిల్లీ క్యాపిటల్స్‌కు అద్భుత అవకాశం.. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌కు దిల్లీ వేదికగా నిలిచింది.  యూపీ వారియర్స్‌ టాస్‌ నెగ్గడంతో ఆ జట్టు కెప్టెన్ ఎలీసా హీలే బ్యాటింగ్‌ ఎంచుకుంది. రెండు మార్పులతో దిల్లీ.. ఒకేఒక్క మార్పుతో దిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగాయి. 

తుది జట్టు ఇవే: 

దిల్లీ క్యాపిటల్స్‌: మెగ్‌ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, ఎలిస్‌ కాప్సీ, జెమీమా రోడ్రిగ్స్‌, అన్నాబెల్ సదర్లాండ్, జెస్ జొనాసెన్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, తనియా భాటియా (వికెట్ కీపర్), షికా పాండే,  టిటాస్ సధు

యూపీ వారియర్స్‌: ఎలీసా హీలే (కెప్టెన్/వికెట్ కీపర్), కిరణ్ నవ్‌గిరె, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్‌ హారిస్‌, శ్వేతా సెహ్రావత్‌, దీప్తి శర్మ, పూనమ్‌ ఖెమ్నర్, సోఫీ ఎక్లెస్టోన్, ఉమా చెత్రి, గౌహర్ సుల్తానా, సైమా ఠాకూర్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని