Dhoni: జడేజాను భర్తీ చేయడం కష్టం.. అతడికి ఎవరూ సాటిరారు: ధోనీ
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను భర్తీ చేయడం కష్టమని, అతడికి ఎవరూ సాటిలేరని చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అన్నాడు...
ముంబయి: ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను భర్తీ చేయడం కష్టమని, అతడికి ఎవరూ సాటిలేరని చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అన్నాడు. గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్‌లో టాస్ వేసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. జడేజాను మిస్ అవుతున్నారా అని అడిగిన ప్రశ్నకు ధోనీ ఇలా సమధానమిచ్చాడు. జడ్డూ లాంటి ఆటగాడు తమకు ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా ఉపయోగపడతాడని, ఫీల్డింగ్‌లోనూ అతడిని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పాడు. ఇక మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడంపై స్పందిస్తూ.. టీ20ల్లో 130 కన్నా తక్కువ స్కోరును కాపాడుకోవడం కష్టమని అన్నాడు.
‘ఈ మ్యాచ్‌లో మా బౌలర్లకు ఒక్కటే చెప్పాను. ఫలితం గురించి ఆలోచించకుండా కట్టుదిట్టంగా బంతులేయమన్నా. ముఖేశ్ చౌదరి, సిమర్జీత్ సింగ్ యువ బౌలర్లు చాలా గొప్పగా బౌలింగ్ చేశారు. ఇలాంటి తక్కువ స్కోర్ల గేమ్ వాళ్లకు ఆత్మవిశ్వాసం పెంపొందడానికి బాగా ఉపయోగపడుతుంది. వీళ్లిద్దరూ రాణించడం అద్భుతంగా ఉంది. ఇక బ్యాటింగ్ విషయంలో ఎవరైనా ఆరంభంలో కొన్ని బంతులు జాగ్రత్తగా ఆడాలి. లేకపోతే వికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వాటిని సరిగ్గా ఎదుర్కొంటే తర్వాత రాణించొచ్చు. కానీ, దురదృష్టంకొద్దీ మేం ఈరోజు విఫలమయ్యాం. ముంబయి బౌలర్లు చాలా గొప్పగా బౌలింగ్ చేశారు. మేం ఇంకాస్త మెరుగైన ప్రదర్శన చేయాల్సింది. అలాగే మా టీమ్‌లో కొంత మంది బ్యాట్స్‌మెన్ మంచి బంతులకు కూడా ఔటయ్యారు. రాబోయే మ్యాచ్‌ల్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతారని ఆశిస్తున్నా’ అని మహీ పేర్కొన్నాడు. కాగా, ఈ మ్యాచ్‌లో చెన్నై నిర్దేశించిన 98 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ముంబయి 5 వికెట్లు కోల్పోయి 14.5 ఓవర్లలో ఛేదించింది. ఈ ఓటమితో చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలు పూర్తిగా కోల్పోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
166.. 58 బంతుల్లో ఉఫ్
47 నిమిషాలు.. 58 బంతులు.. 167 పరుగులు.. 0 వికెట్లు! బుధవారం ఉప్పల్ స్టేడియంలో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటింగ్ విధ్వంసమిది. ఇన్నింగ్స్ విరామంలో అభిమానులు స్నాక్స్ తెచ్చుకునేలోపే.. టీవీ సెట్ల ముందున్న ప్రేక్షకులు కాస్త బ్రేక్ తీసుకునేలోపే సన్‌రైజర్స్ లక్ష్య ఛేదన పూర్తయింది. -
ముంబయి తప్ప..
ఐపీఎల్-17 లీగ్ దశలో ఇంకా 13 మ్యాచ్‌లే మిగిలాయి. కానీ ఇప్పటికీ ఏ జట్టూ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరలేదు. లఖ్‌నవూపై సన్‌రైజర్స్ విజయంతో ముంబయి అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
సంగీతం వింటూ.. సిరీస్‌లు చూస్తూ
ఒలింపిక్స్ పతకం నెగ్గాలన్నది ప్రతి అథ్లెట్ కల. అందుకోసం ఒక్కో అథ్లెట్ ఒక్కోలా సాగుతారు. తీవ్రమైన సాధన చేస్తూనే మెదడును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఇతర వ్యాపకాల్లోనూ మునిగిపోతారు. -
మూడేళ్లలో తొలిసారి..
ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడనున్నాడు. భువనేశ్వర్‌లో ఈ నెల 12 నుంచి 15 వరకు జరిగే జాతీయ ఫెడరేషన్ కప్‌లో అతడు ఆడనున్నాడు. -
ఓడలో ఫ్రాన్స్‌కు ఒలింపిక్ జ్యోతి
1896లో తొలిసారి ఉపయోగించిన మూడు వరుసల తెరచాపలతో కూడిన పురాతన ఓడ.. మధ్యధరా సముద్రంలో 12 రోజుల పాటు ప్రయాణం.. చివరగా గమ్యాన్ని చేరుకుని ఫ్రాన్స్‌లో ఒలింపిక్ జ్యోతి వెలుగులు నింపింది. -
నా రికార్డులను జైస్వాల్ బద్దలు కొడతాడు
టీమ్ఇండియా యువ ఓపెనర్, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించే యశస్వి జైస్వాల్‌కు గొప్ప భవిష్యత్తు ఉందని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా కొనియాడాడు. -
శాంసన్.. మాస్టర్ బ్లాస్టర్!
ఈ ఐపీఎల్లో భీకర ఫామ్‌తో సాగిపోతున్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్‌పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసల జల్లు కురిపించాడు. అతణ్ని మాస్టర్బ్లాస్టర్గా అభివర్ణించాడు. -
అమన్‌పై ఆశలు
ప్రపంచ రెజ్లింగ్ క్వాలిఫయర్స్ గురువారం ఆరంభం కానున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల కోసం ఇదే చివరి అర్హత ఈవెంట్. భారత ఫ్రీస్టైల్ రెజ్లర్లలో అమన్ శెరావత్, దీపక్ పునియాలపై పెద్ద ఆశలే ఉన్నాయి. -
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
సొంత గడ్డపై హైదరాబాద్ ఎప్పటికీ మరిచిపోలేని అద్భుతమైన విజయాన్ని అందుకుంది. లఖ్‌నవూను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ పలు రికార్డులు నమోదు చేసింది. -
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
ఒకే ఒక్క క్యాచ్ రాజస్థాన్‌ను ఓటమి వైపు నడిపించగా.. గెలుస్తామనే ఆశలు లేని సమయంలో దిల్లీకి ఊపిరి పోసింది. దీంతో ఆ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. -
నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌పై బ్రియాన్ లారా అభినందనల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో ఎన్నో రికార్డులను కొల్లగొడతాడని పేర్కొన్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్‌లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్