Dinesh Karthik : ఐపీఎల్‌లో అత్యధిక డక్‌లు.. చెత్త రికార్డుతో నిరాశపరుస్తోన్న డీకే

గత సీజన్లో రాణించిన దినేశ్‌ కార్తిక్‌(Dinesh Karthik).. ఈ ఐపీఎల్‌(IPL 2023)లో మాత్రం పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 17 Apr 2023 16:55 IST

బెంగళూరు :  ఆర్సీబీ(RCB) వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తిక్‌(Dinesh Karthik) ఈ ఐపీఎల్‌(IPL 2023) సీజన్‌లో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. జట్టు ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. ఇప్పటి వరకూ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అతడు చేసిన మొత్తం పరుగులు 10 మాత్రమే. ఇందులో రెండు డకౌట్లు ఉన్నాయి. శనివారం దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే ఓ చెత్త రికార్డు అతడి ఖాతాలోకి చేరింది. 

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్‌ అయిన వారి జాబితాలో  15 డకౌట్లతో తొలి స్థానాన్ని మన్‌దీప్‌సింగ్‌తో కలిసి డీకే పంచుకుంటున్నాడు. మొత్తం 233 మ్యాచ్‌లు ఆడిన డీకే.. 15 సార్లు పరుగులేమీ చేయకుండా వెనుదిరిగాడు. ఇక ఈ జాబితాలో వీరి తర్వాత సునీల్‌ నరైన్‌(14 డక్‌లు), రోహిత్‌ శర్మ(14 డక్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఈ సీజన్‌లో డీకేను బెంగళూరు(Royal Challengers Bangalore) అట్టిపెట్టుకుంది. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా అతడికి ప్రాధాన్యమిస్తోంది. అయినప్పటికీ.. అతడు పేలవ ప్రదర్శన ఇస్తుండటంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. నేడు చెన్నైతో మ్యాచ్‌ నేపథ్యంలో అతడు రాణించాలని పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని