టాస్‌ ఓడిన కోహ్లీ: మళ్లీ తొలుత బ్యాటింగే

భారత్‌, ఇంగ్లాండ్‌ నాలుగో టీ20 మ్యాచ్‌ టాస్‌ వేశారు. ఇంగ్లిష్‌ జట్టు సారథి మోర్గానే మళ్లీ టాస్‌ గెలిచాడు. తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. నిర్ణయాత్మక పోరులో కోహ్లీసేనను పరీక్షించేందుకే నిర్ణయించుకున్నాడు. ఈ పోరు‌ కోసం తొలి టీ20కి వాడిన పిచ్‌నే ఉపయోగిస్తున్నారు...

Updated : 18 Mar 2021 18:39 IST

అహ్మదాబాద్‌: భారత్‌, ఇంగ్లాండ్‌ నాలుగో టీ20 మ్యాచ్‌ టాస్‌ వేశారు. ఇంగ్లిష్‌ జట్టు సారథి మోర్గానే మళ్లీ టాస్‌ గెలిచాడు. తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. నిర్ణయాత్మక పోరులో కోహ్లీసేనను పరీక్షించేందుకే నిర్ణయించుకున్నాడు. ఈ పోరు‌ కోసం తొలి టీ20కి వాడిన పిచ్‌నే ఉపయోగిస్తున్నారు. అప్పటితో పోలిస్తే పచ్చికను పూర్తిగా తొలగించారు. వికెట్‌ చాలా గట్టిగా ఉంది. ఆంగ్లేయులు మళ్లీ అదనపు పేస్‌, బౌన్స్‌తో ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే బ్యాటింగ్‌కు మాత్రం అనుకూలిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పోరులో ఓడితే టీమ్‌ఇండియా సిరీస్‌ చేజార్చుకుంటుంది. రాహుల్‌ చాహర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టులోకి వచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని