భరత్‌కు అద్భుత అవకాశం

టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ పరిమిత ఓవర్ల క్రికెట్లో తన ప్రతిభను ప్రదర్శించడానికి ఐపీఎల్‌-16 అద్భుతమైన అవకాశమని భారత సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నాడు.

Updated : 31 Mar 2023 03:26 IST

చెన్నై: టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ పరిమిత ఓవర్ల క్రికెట్లో తన ప్రతిభను ప్రదర్శించడానికి ఐపీఎల్‌-16 అద్భుతమైన అవకాశమని భారత సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నాడు. ‘‘భరత్‌ టెస్టు క్రికెటర్‌. పరిమిత ఓవర్ల క్రికెట్లో తన ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించింది. సత్తాచాటేందుకు భరత్‌కు ఇది అద్భుత అవకాశం. గుజరాత్‌ టైటాన్స్‌ రూపంలో మంచి ఫ్రాంచైజీలో అతను ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో భరత్‌ మంచి ప్రదర్శన కనబరిచాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున లభించిన కొన్ని అవకాశాల్లో అతను రాణించాడు. ఇప్పుడు సత్తాచాటి తనను తాను సుస్థిరమైన స్థానంలో నిలబెట్టుకోవచ్చు’’ అని ఎమ్మెస్కే తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని