జకో.. కష్టంగా
23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ (సెర్బియా) ఫ్రెంచ్ ఓపెన్‌లో కష్టంగా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ఈ మూడో సీడ్ ఆటగాడు 7-6 (7-4), 7-6 (7-5), 6-2 తేడాతో 29వ సీడ్ డేవిడోవిచ్ ఫొకినా (స్పెయిన్)పై పోరాడి గెలిచాడు.
ప్రిక్వార్టర్స్‌లో అడుగు
పెగులా, రుబ్లెవ్ ఔట్
ఫ్రెంచ్ ఓపెన్
పారిస్
23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన టెన్నిస్ దిగ్గజం జకోవిచ్ (సెర్బియా) ఫ్రెంచ్ ఓపెన్‌లో కష్టంగా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ఈ మూడో సీడ్ ఆటగాడు 7-6 (7-4), 7-6 (7-5), 6-2 తేడాతో 29వ సీడ్ డేవిడోవిచ్ ఫొకినా (స్పెయిన్)పై పోరాడి గెలిచాడు. తొలి సెట్ ఆరంభం నుంచే ఇద్దరు క్రీడాకారులు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. అయిదో గేమ్‌లో జకో సర్వీస్‌ను బ్రేక్ చేసి ఫొకినా 3-2తో ఆధిక్యం సాధిస్తే.. తర్వాతి గేమ్‌లోనే సర్వీస్ బ్రేక్ చేసి మళ్లీ 3-3తో జకో స్కోరు సమం చేశాడు. 5-6తో వెనుకబడ్డ దశలోనూ ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి జకో 6-6తో పోరును టైబ్రేకర్‌కు మళ్లించాడు. అందులో విన్నర్లతో సత్తాచాటి పైచేయి సాధించాడు. ఒకరు ఆధిక్యంలోకి వెళ్లడం.. వెంటనే మరొకరు స్కోరు సమం చేయడం.. రెండో సెట్ ఇలాగే సాగింది. అందులోనూ టైబ్రేకర్‌లో జకోదే గెలుపు. మూడో సెట్లో జకో జూలు విదిల్చాడు. 3-0తో ఆధిక్యం సాధించిన అతను.. అదే ఊపులో మ్యాచ్ ముగించాడు. ఈ పోరులో జకో 3 ఏస్‌లు, 34 విన్నర్లు కొట్టాడు. మరోవైపు ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 7-5, 6-0, 3-6, 6-7 (5-7), 3-6తో సొనెగో (ఇటలీ) చేతిలో పోరాడి ఓడాడు. తొలి రెండు సెట్లు గెలిచి.. విజయం వైపు దూసుకెళ్లిన రుబ్లెవ్‌కు మూడో సెట్లో బ్రేక్ పడింది. వరుసగా మూడు సెట్లు ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. 11వ సీడ్ కచనోవ్ (రష్యా) 6-4, 6-1, 3-6, 7-6 (7-5)తో కొకినాకిస్ (ఆస్ట్రేలియా)పై, సెబాస్టియన్ (ఆస్ట్రియా) 5-7, 6-3, 7-5, 1-6, 6-4తో ఫాగ్నిని (ఇటలీ)పై నెగ్గారు.
పెగులాకు షాక్..: మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా)కు షాక్. మూడో రౌండ్లో ఆమె 1-6, 3-6 తేడాతో 28వ సీడ్ ఎలీస్ మార్టిజ్ (బెల్జియం) చేతిలో చిత్తయింది. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి మార్టిజ్‌దే జోరు. తొలి సెట్ రెండు, నాలుగో గేమ్‌ల్లో ప్రత్యర్థి సర్వీస్ బ్రేక్ చేసి, ఆపై 5-0తో దూసుకెళ్లిన ఆమె.. అలవోకగా గెలిచింది. రెండో సెట్లో 3-3 వరకు పోరు హోరాహోరీగా సాగింది. కానీ అక్కడి నుంచి మళ్లీ మార్టిజ్‌దే ఆధిపత్యం. వరుసగా మూడు గేమ్‌లు నెగ్గిన ఆమె విజేతగా నిలిచింది. ఈ పోరులో మార్టిజ్ 20 ఏస్‌లు కొట్టింది. రెండో సీడ్ సబలెంక (బెలారస్) ప్రిక్వార్టర్స్ చేరింది. మూడో రౌండ్లో ఆమె 6-2, 6-2తో రకిమోవా (రష్యా)పై గెలిచింది. ఈ మ్యాచ్‌లో 6 ఏస్‌లు కొట్టిన సబలెంక.. 27 విన్నర్లు సంధించింది. తొమ్మిదో సీడ్ కసత్కిన (రష్యా) 6-0, 6-1తో స్టెర్న్స్ (అమెరికా)పై, స్వితోలినా (ఉక్రెయిన్) 2-6, 6-2, 7-5తో బ్లింకోవా (రష్యా)పై, స్టీఫెన్స్ (అమెరికా) 6-3, 3-6, 6-2తో పుతింత్సెవా (కజకిస్థాన్)పై నెగ్గారు. పవ్లిచెంకోవా, ఎలీనా (రష్యా) కూడా ముందంజ వేశారు.
యుకి జోడీకి నిరాశ: పురుషుల డబుల్స్‌లో భారత జోడీ యుకి బాంబ్రి- సాకేత్ మైనేనికి నిరాశే ఎదురైంది. రెండో రౌండ్లో యుకి- సాకేత్ జంట 4-6, 5-7 తేడాతో గొంజాలెజ్ (మెక్సికో)- రోజర్ (ఫ్రాన్స్) చేతిలో ఓడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
IPAC-YSRCP: ప్రభుత్వ కార్యక్రమంలో ‘ఐ’ప్యాక్!
-
TS News: భారాసకు రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గుడ్‌బై
-
Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి బస్సు యాత్రకు ఏర్పాట్లు?
-
Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు
-
TDP: ఎవరెస్ట్ వద్ద ఎగిరిన పసుపుజెండా