ఒకరా? ఇద్దరా?
స్పిన్ విషయానికి వస్తే అశ్విన్, జడేజా, అక్షర్‌తో భారత్ బలంగానే ఉంది. కానీ పేసర్లకే ఎక్కువగా అనుకూలించే ఓవల్‌లో టీమ్‌ఇండియా ఎంతమంది స్పిన్నర్లను ఆడిస్తుందన్నదే ఇక్కడ ప్రశ్న.
స్పిన్ విషయానికి వస్తే అశ్విన్, జడేజా, అక్షర్‌తో భారత్ బలంగానే ఉంది. కానీ పేసర్లకే ఎక్కువగా అనుకూలించే ఓవల్‌లో టీమ్‌ఇండియా ఎంతమంది స్పిన్నర్లను ఆడిస్తుందన్నదే ఇక్కడ ప్రశ్న. ఓవల్‌లో గత 10 టెస్టులు చూసుకుంటే.. పేసర్లు 30.57 సగటుతో 252 వికెట్లు పడగొట్టగా, స్పిన్నర్లు 34.83 సగటుతో 68 వికెట్లు తీశారు. మరోవైపు 2021 డబ్ల్యూటీసీ ఫైనల్లో అశ్విన్, జడేజాను భారత్ ఆడించింది. కానీ ఈ ఇద్దరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. మన పేసర్లు మెరుగ్గా బౌలింగ్ చేసినా.. బ్యాటర్ల వైఫల్యంతో అప్పుడు కివీస్ చేతిలో ఓటమి తప్పలేదు. దీంతో ఆ మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లను ఆడించడంపై విమర్శలొచ్చాయి. ఒక్కరే స్పిన్నర్‌ను ఆడించి, అదనంగా మరో పేసర్‌ను బరిలో దింపాల్సిందన్న వ్యాఖ్యలూ వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ సారి జట్టు మేనేజ్‌మెంట్‌్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఒకవేళ ఒక్కరినే ఆడించాల్సి వస్తే అది కచ్చితంగా జడేజానే కావొచ్చు. ఇటీవల కాలంలో బ్యాటింగ్‌లోనూ అతని ఉత్తమ ప్రదర్శనే అందుకు కారణం. కానీ ఇంగ్లాండ్‌లో అతని బౌలింగ్ ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. 10 టెస్టుల్లో 46.13 సగటుతో 22 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగాడు. అదే అశ్విన్ అయితే అక్కడ 6 టెస్టుల్లో 32.92 సగటుతో 14 వికెట్లు సాధించాడు. అక్షర్ ఇప్పటివరకూ ఇంగ్లాండ్‌లో టెస్టు ఆడలేదు. మరి ఫైనల్లో టీమ్‌ఇండియా ఎలాంటి బౌలింగ్ కూర్పుతో బరిలో దిగుతుందో? ఏ వ్యూహంతో మంచి ఫలితం సాధిస్తుందో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
మీ వాళ్లు కబ్జా చేస్తే.. మీరు సెటిల్మెంట్ చేశారు: ఆదోని ఎమ్మెల్యే కుమారుడిని చుట్టుముట్టిన జనం
-
‘భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు ఏం చేశారు?’
-
AP News: హోం మంత్రి వస్తే ఊరొదిలి వెళ్లాలా?
-
పాపికొండల యాత్ర ప్రారంభం
-
నేటితో ముగియనున్న చంద్రబాబు రిమాండ్
-
Rajinikanth: కరుణానిధి సంభాషణలా.. అమ్మబాబోయ్!