Cricket in Olympic Games: ఇది నూతన శకానికి నాంది

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం నూతన శకానికి నాంది అని దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ అన్నాడు. 2028 లాస్‌ఏంజెలెస్‌  ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చిన నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు.

Updated : 17 Oct 2023 09:25 IST

ముంబయి: ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం నూతన శకానికి నాంది అని దిగ్గజ ఆటగాడు సచిన్‌ తెందుల్కర్‌ అన్నాడు. 2028 లాస్‌ఏంజెలెస్‌  ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చిన నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. ‘‘128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత లాస్‌ఏంజెలెస్‌ వేదికగా మన ప్రియమైన క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చూడబోతున్నాం. ఇది నూతన శకానికి నాంది. ప్రపంచ వేదికపై వర్ధమాన జట్లకు సత్తా చాటేందుకు గొప్ప అవకాశం. ఇదెంతో ప్రత్యేకమైన సమయం’’ అని సచిన్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని