Ben Stokes: స్టోక్స్‌ వస్తున్నాడు.. రాత మారేనా?

ఒకటేమో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌. మరొకటేమో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో బలంగా కనిపిస్తున్న దక్షిణాఫ్రికా. కానీ ప్రపంచకప్‌లో ఈ రెండూ చిన్న జట్ల చేతుల్లో అనూహ్య పరాజయాలు చవిచూశాయి.

Updated : 21 Oct 2023 07:48 IST

నేడు దక్షిణాఫ్రికాతో ఇంగ్లాండ్‌ పోరు

ముంబయి: ఒకటేమో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌. మరొకటేమో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో బలంగా కనిపిస్తున్న దక్షిణాఫ్రికా. కానీ ప్రపంచకప్‌లో ఈ రెండూ చిన్న జట్ల చేతుల్లో అనూహ్య పరాజయాలు చవిచూశాయి. ఇంగ్లాండ్‌ను అఫ్గానిస్థాన్‌ ఓడించగా.. దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్‌ గెలిచింది. ఇప్పుడీ ఓటములను దాటి టోర్నీలో ముందుకు సాగే దిశగా విజయంపై కన్నేసిన ఈ జట్లు శనివారం పరస్పరం తలపడనున్నాయి. ఈ కప్పులో ఇంగ్లాండ్‌ ప్రయాణం ఒడుదొడుకులతో సాగుతోంది. ఆరంభ మ్యాచ్‌లో కివీస్‌ చేతిలో ఓడిన ఆ జట్టు.. అనంతరం బంగ్లాదేశ్‌పై నెగ్గింది. గత మ్యాచ్‌లో అఫ్గాన్‌ వీరుల ముందు తలవంచింది. సఫారీ జట్టుతో మ్యాచ్‌లో స్టార్‌ ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌ పునరాగమనం చేసే అవకాశాలుండటం ఇంగ్లిష్‌ జట్టుకు ఉత్సాహాన్నిచ్చేదే. తుంటి గాయంతో అతను తొలి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మరోవైపు ఆస్ట్రేలియా, శ్రీలంకను 100కు పైగా పరుగుల తేడాతో ఓడించిన దక్షిణాఫ్రికా డచ్‌ జట్టుకు దాసోహమంది. టోర్నీ చరిత్రలోనే అత్యధిక స్కోరు (428/5) చేసిన ఆ జట్టు నెదర్లాండ్స్‌పై ఛేదనలో విఫలమైంది. ఇప్పుడు ఇంగ్లాండ్‌పై గెలవాలని చూస్తున్న ఆ జట్టుకు డికాక్‌, మార్‌క్రమ్‌, వాండర్‌ డసెన్‌, రబాడ, జాన్సన్‌, మిల్లర్‌ కీలకం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని