Shami: షమి.. తగ్గేదేలే

తొలి నాలుగు మ్యాచ్‌ల్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌.. అవకాశం వచ్చినప్పటి నుంచి చెలరేగిపోతున్నాడు.

Updated : 30 Oct 2023 09:04 IST

తొలి నాలుగు మ్యాచ్‌ల్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌.. అవకాశం వచ్చినప్పటి నుంచి చెలరేగిపోతున్నాడు. న్యూజిలాండ్‌లో గత మ్యాచ్‌లో అతను అయిదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆదివారం ఇంగ్లాండ్‌పైనా అతను అదే స్థాయిలో రెచ్చిపోయాడు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై కసిగా బౌలింగ్‌ చేసిన షమి.. ఇంగ్లిష్‌ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. అతడి బంతులను ఎదుర్కోవడం ప్రత్యర్థి ఆటగాళ్లకు శక్తిని మించిన పనే అయింది. స్టోక్స్‌ను ఇన్‌స్వింగర్‌తో బౌల్డ్‌ చేసిన తీరు ఈ మ్యాచ్‌కే హైలైట్‌. స్పిన్‌ చేస్తే బంతి టర్న్‌ అయినట్లుగా లోపలికి అనూహ్యంగా దూసుకొచ్చిన బంతికి స్టంప్స్‌ చెల్లాచెదురయ్యాయి. ఏం జరిగిందో అర్థం కానట్లుగా చూస్తూ వెళ్లిపోయాడు స్టోక్స్‌. పట్టుదలతో ఆడుతున్న మొయిన్‌ అలీని ఔట్‌ చేసిన బంతి కూడా షమి ప్రత్యేకతను చాటేదే. వేగం, కచ్చితత్వంతో తానెంత విలువైన బౌలర్‌నో మరోసారి చాటిన షమి.. భారత బౌలింగ్‌ విభాగానికి తిరుగులేని బలాన్నిచ్చాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని