Hardik Pandya: హార్దిక్‌కు హేళన.. రోహిత్‌కు నీరాజనం

ముంబయి ఇండియన్స్‌ యాజమాన్యం ఈ సీజన్‌కు జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను తప్పించి హార్దిక్‌ పాండ్యను నియమించడంపై ఎంతటి దుమారం రేగిందో తెలిసిందే.

Updated : 25 Mar 2024 08:14 IST

ముంబయి ఇండియన్స్‌ యాజమాన్యం ఈ సీజన్‌కు జట్టు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను తప్పించి హార్దిక్‌ పాండ్యను నియమించడంపై ఎంతటి దుమారం రేగిందో తెలిసిందే. దీంతో సీజన్లో ముంబయి తొలి మ్యాచ్‌లో హార్దిక్‌, రోహిత్‌ల మీదే అందరి దృష్టీ నిలిచింది. హార్దిక్‌ టాస్‌ కోసం వచ్చినపుడు స్టేడియంలో అభిమానులు అతణ్ని హేళన చేస్తూ అరిచారు. రోహిత్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అతను క్యాచ్‌ అందుకున్నపుడు, బ్యాటింగ్‌ చేస్తున్నపుడు స్టేడియం హోరెత్తింది. ఇక మ్యాచ్‌లో ఎప్పుడూ వలయం లోపల ఫీల్డింగ్‌ చేసే రోహిత్‌ను బౌండరీ వద్ద పెట్టడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. ఆటగాడిగా ఉన్నపుడు హార్దిక్‌ కూడా డీప్‌లోనే ఫీల్డింగ్‌ చేసేవాడు. మ్యాచ్‌లో ఒక సందర్భంలో బుమ్రా.. రోహిత్‌తో మాట్లాడుతుంటే హార్దిక్‌ అసహనంతో వెళ్లిపోవడం.. హార్దిక్‌ను చూపిస్తూ బుమ్రాతో రోహిత్‌ ఏదో అనడం అందరి దృష్టినీ ఆకర్షించింది. గత కొన్ని సీజన్లలో కెప్టెన్‌గా ఉండగా బ్యాటింగ్‌తో ఆకట్టుకోని రోహిత్‌.. బ్యాటర్‌గా    తొలి మ్యాచ్‌లోనే అదిరే   ఇన్నింగ్స్‌ ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు