RCB vs GT: శతకంతో గిల్ విధ్వంసం.. బెంగళూరు ఓటమి.. ప్లేఆఫ్స్‌కు ముంబయి
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో 8 విజయాలతో ముంబయి జట్టు ఫ్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
బెంగళూరు: విరాట్ కోహ్లీ శతకం వృథా అయింది. కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తడబడింది. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో 8 విజయాలతో ముంబయి జట్టు ఫ్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. 198 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్‌మన్ గిల్(104*: 52 బంతుల్లో 8 సిక్స్‌లు, 5 ఫోర్లు) మెరుపు శతకం చేసి ఒంటిచేత్తో తమ జట్టుకు విజయాన్నిందించాడు. విజయ్ శంకర్ (53: 35 బంతుల్లో 2 సిక్స్‌లు, 7 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. బెంగళూరు బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 2, విజయ్‌కుమార్ వైశక్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు. పార్నెల్ 3.1 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చుకున్నాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (101*) సెంచరీతో చెలరేగాడు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ 2, షమీ, దయాల్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌తో ఈ సీజన్ లీగ్ దశ ముగిసింది. సెంచరీతో చెలరేగిన గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చింది.
గిల్ విశ్వరూపం.. రాణించిన శంకర్
198 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ 25 పరుగుల వద్ద సాహా రూపంలో తొలివికెట్ కోల్పోయింది. అయితే తొలి వికెట్ తీసిన ఆనందం బెంగళూరుకు ఎంతో సేపు నిలవలేదు. విజయ్ శంకర్‌తో జట్టు కట్టిన శుభ్‌మన్ గిల్ వీరవిహారం చేశాడు. రెండో ఓవర్ నుంచే ఫోర్లతో విరుచుకుపడిన గిల్ ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 51 పరుగులతో నిలిచింది. ఆ తర్వాత గేరు మార్చిన గిల్ విధ్వంసం సృష్టించాడు. బౌలర్ ఎవరైనా లెక్కచేయకుండా సిక్స్‌లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 90 పరుగులు చేసింది. మరోవైపు మెళ్లిగా పుంజుకున్న విజయ్ శంకర్ సైతం ఫోర్లు, సిక్స్‌లతో మెరిపించాడు. ఈక్రమంలో గిల్ 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. అర్ధసెంచరీ అనంతరం మరింతగా చెలరేగిన గిల్ 13వ ఓవర్ వేసిన బ్రేస్‌వెల్‌కు చుక్కలు చూపాడు. రెండు సిక్స్‌లతో మొత్తం 16 పరుగులు పిండుకున్నాడు.
15వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో అర్ధసెంచరీ చేసి మంచి ఊపుమీదున్న విజయ్ శంకర్‌ను విజయ్‌కుమార్ ఔట్ చేశాడు. 15 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి పటిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే ఆ తర్వాత వచ్చిన శనక డౌకౌట్ అయ్యాడు. డేవిడ్ మిల్లర్(6) సైతం వెంటనే ఔట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠ స్థితికి చేరుకునే అవకాశం ఉందని భావించారు. చివరి మూడు ఓవర్లలో గుజరాత్ విజయానికి 34 పరుగులు అవసరం. అయితే ఒత్తిడిని చిత్తుచేస్తూ గిల్ 18వ ఓవర్‌లో రెండు సిక్స్‌లతో మొత్తం 15 పరుగులు రాబట్టాడు. దీంతో గెలుపు సమీకరణం 12 బంతుల్లో 19 పరుగులుగా మారింది. 19వ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. దీంతో గెలుపు సమీకరణం 6 బంతుల్లో 8 పరుగులుగా మారింది. 20వ ఓవర్‌లో తొలి బంతి నోబాల్ కాగా, మరుసటి వైడ్ అయింది. మరోవైపు 98 పరుగులతో సెంచరీకి చేరువైన గిల్ సిక్స్ కొట్టి సెంచరీ చేయడంతో పాటు ఇన్నింగ్స్‌ను ముగించాడు.
విరాట్ విధ్వంసం..
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. డుప్లెసిస్(28: 19 బంతుల్లో) కలిసి బరిలోకి దిగిన కోహ్లీ(101*: 61 బంతుల్లో ఒక సిక్స్, 13 ఫోర్లు) ఆరంభం నుంచే దూకుడుగా ఆడడంతో మంచి భాగస్వామ్యం లభించింది. తొలి వికెట్ వీరు 67 పరుగులు చేశారు. ఈ క్రమంలో 7.1 ఓవర్ల వద్ద డుప్లెసిస్ ఔట్ కావడంతో మాక్స్‌వెల్(11) క్రీజులోకి వచ్చాడు. అయితే 80 పరుగుల వద్ద మాక్స్‌వెల్, 85 పరుగుల వద్ద లామ్రోర్(1) స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో బెంగళూరు స్కోర్ ఒకింత నెమ్మదించింది. అయితే బ్రేస్‌వెల్(26: 16 బంతుల్లో 5 ఫోర్లు)తో జట్టు కట్టిన కోహ్లీ మరింత దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 35 బంతుల్లో కోహ్లీ అర్ధశతకం చేశాడు. మరోవైపు దూకుడుగా ఆడే క్రమంలో బ్రేస్‌వెల్ 14వ ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. అప్పటికీ ఆర్సీబీ స్కోర్ 132. ఆతర్వాత వచ్చిన కార్తిక్ డకౌట్ అయ్యాడు. దీంతో అనుజ్ రావత్(23*: 15 బంతుల్లో ఒక సిక్స్, ఒక ఫోర్)తో ఇన్నింగ్స్ నిర్మించిన కోహ్లీ ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాడు. 15 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసిన ఆర్సీబీ.. మిగతా ఐదు ఓవర్లలో 61 పరుగులు చేసింది. కోహ్లీ ఎడాపెడా ఫోర్లు బాదాడు. మరోవైపు అనుజ్ సైతం దాటిగా ఆడడంతో గుజరాత్‌కు బెంగళూరు భారీ స్కోర్‌ను లక్ష్యంగా నిర్దేశించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!
-
Sports News
WTC Final: కెన్నింగ్టన్ ఓవల్‌లో మూడో హాఫ్ సెంచరీ.. డాన్ బ్రాడ్‌మన్ సరసన శార్దూల్