WTC Points Table: ఒక్క రోజులోనే రెండో స్థానానికి పడిపోయిన టీమ్‌ఇండియా

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ (WTC) పాయింట్ల పట్టికలో టీమ్‌ఇండియా (Team India) ఒక్కరోజు వ్యవధిలోనే రెండో స్థానానికి పడిపోయింది. 

Published : 07 Jan 2024 02:11 IST

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాపై రెండో టెస్టులో ఘన విజయం సాధించి డబ్ల్యూటీసీ (WTC) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకున్న టీమ్‌ఇండియా (Team India) ఒక్క రోజు వ్యవధిలోనే రెండో స్థానానికి పడిపోయింది. పాకిస్థాన్‌తో జరిగిన మూడో టెస్టులో గెలుపొంది సిరీస్‌ను 3-0తో స్వీప్‌ చేసిన ఆస్ట్రేలియా టాప్‌లోకి వెళ్లింది. ప్రస్తుతం ఆసీస్‌ (56.25) పాయింట్ల శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. భారత్‌ (54.16) పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. పాక్‌ (36.66) ఆరో స్థానానికి పడిపోయింది. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్.. వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.


ప్రతి దేశానికి బుమ్రా లాంటి బౌలర్‌ ఉంటే.. 

టీమ్‌ఇండియా పేసర్ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)పై భారత మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ (Irfan Pathan) ప్రశంసలు కురిపించాడు. ‘‘శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత కూడా బుమ్రా టెస్టు క్రికెట్‌లో రాణిస్తున్నాడు. ఏ ఆటగాడైనా సర్జరీ తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌కు ప్రాధాన్యం ఇస్తే వారికి బుమ్రానే పెద్ద బ్రాండ్ అంబాసిడర్‌. ప్రతి దేశానికి బుమ్రా లాంటి బౌలర్‌ ఉంటే టెస్టు క్రికెట్ అభివృద్ధి చెందుతుంది. వెన్ను శస్త్రచికిత్స తర్వాత అతడు బౌలింగ్‌ చేస్తున్న తీరుని చూసి నేను ఫిదా అయ్యా. బుమ్రా భారత్‌కే కాకుండా ప్రపంచ క్రికెట్‌కూ స్ఫూర్తిదాయకంగా నిలిచాడు’’ అని ప్రశంసించాడు.

వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకుని 11 నెలల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చిన బుమ్రా.. రీ ఎంట్రీలోనూ అదరగొడుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో 20 వికెట్లు పడగొట్టి భారత్‌ ఫైనల్‌ చేరడంలో కీలకపాత్ర పోషించాడు. సఫారీలతో జరిగిన రెండు టెస్టుల్లో బుమ్రా 12 వికెట్లు పడగొట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు