Shubman Gill: కష్టకాలంలో ద్రవిడ్‌ సహకారాన్ని మర్చిపోను: గిల్‌

తాను విఫలమైనపుడు కోచ్‌ ద్రవిడ్‌ ఇచ్చిన సహకారాన్ని శుభమన్‌ గిల్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. 

Published : 27 Feb 2024 18:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాలుగో టెస్టులో విజయం సాధించి టీమ్‌ఇండియా సిరీస్‌ సొంతం చేసుకున్న సందర్భంగా భారత యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్ (Rahul Dravid) గురించి ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. తనను నిరంతరం ప్రోత్సహించేది ఆయనే అంటూ ద్రవిడ్‌ చెప్పిన మాటలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశాడు.

 ‘‘మీరు కాకపోతే ఎవరు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?- రాహుల్‌ ద్రవిడ్‌’’ అని అందులో ఉంది. ఈ సిరీస్‌కు ముందు గిల్‌ గత 12 ఇన్నింగ్స్‌లో కనీసం అర్ధ శతకం కూడా చేయలేకపోయాడు. వరుసగా విఫలమవుతూ వచ్చాడు. అనేక శుభారంభాలను పెద్ద స్కోర్లుగా మలచలేకపోయాడు. అయినా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అతడికి అండగా నిలిచారు. అనంతరం వైజాగ్‌ టెస్టులో సెంచరీ చేసి తిరిగి గాడిన పడ్డ గిల్‌ ఆ తరువాత మూడో టెస్టులో 90 పరుగులతో పాటు తప్పక గెలవాల్సిన కీలకమైన నాలుగో టెస్టులో ఒత్తిడిని ఎదుర్కొంటూ అర్ధశతకంతో జట్టును గెలిపించాడు. దీనిపై పలువురు ఆటగాళ్లు అతడిని ప్రశంసిస్తున్నారు. ఈ సిరీస్‌లో శుభ్‌మన్‌ గిల్‌ 48 సగటుతో 342 పరుగులు చేశాడు. 2021లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు తర్వాత గిల్‌ నిలకడగా ఆడలేకపోయాడు. ఈ సంవత్సరంలో 10 ఇన్నింగ్స్‌లో 43 సగటుతో 388 పరుగులు చేశాడు. రాంచీ టెస్టులో 120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన కీలక దశలో ఒత్తిడిని తట్టుకుని అర్ధశతకంతో జట్టును గెలిపించాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని