Neeraj Chopra: పారిస్‌ ఒలింపిక్స్‌లో ఏదైనా జరగొచ్చు: నీరజ్‌ చోప్రా

ఆత్మవిశ్వాసంతో పారిస్‌ ఒలింపిక్స్‌కు వెళితే ఏదైనా సాధ్యమేనని గోల్డెన్‌ బాయ్‌ నీరజ్‌ చోప్రా ఆత్మవిశ్వాసం వ్యక్తంచేశాడు.  

Published : 09 May 2024 17:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రీడల్లో పరిస్థితులు చాలా వేగంగా మారిపోతాయని గోల్డెన్‌ బాయ్‌ నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) అభిప్రాయపడ్డాడు. తాను కనీసం వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌నకు అర్హత సాధిస్తానా అని సందేహించే దశ నుంచి ఇప్పుడు ఎంతో మారిపోయినట్లు పేర్కొన్నాడు. గతేడాది బుడాపెస్ట్‌లో టాప్‌-6 నిలిచిన ఆటగాళ్లలో ముగ్గురు భారతీయులే ఉన్నారని గుర్తు చేశాడు. దీంతో ప్రపంచ జావెలిన్‌లో ఐరోపా ఆటగాళ్లకు తాము ఏమీ తీసిపోమనే ఆత్మవిశ్వాసం వచ్చిందని తెలిపాడు. మనం ఇదే నమ్మకాన్ని పారిస్‌లోకి తీసుకెళితే ఏదైనా సాధ్యమేనని ఆత్మవిశ్వాసం వ్యక్తంచేశాడు. సాయ్‌ మీడియాతో మాట్లాడతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అతడు దోహా లీగ్‌లో పాల్గొనేందుకు వెళ్లాడు. గతేడాది కూడా దోహాలో అతడు బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే.

ఒమెగా సంస్థతో ఒప్పందం..

ఒలింపిక్స్‌కు 1932 నుంచి అధికారిక టైమ్‌ కీపర్‌గా ఉన్న ఒమెగా సంస్థతో నీరజ్‌ ఒప్పందం కుదుర్చుకొన్నాడు. ఈ స్విస్‌ లగ్జరీ వాచ్‌ దిగ్గజం దీనిపై స్పందిస్తూ.. ఒమెగా కుటుంబంలోకి నీరజ్‌కు స్వాగతం. అతడి అంకితభావం, ప్రతిభ, కచ్చితత్వం చూసి ఎంపిక చేశాం’’ అని పేర్కొంది. ఈసందర్భంగా చోప్రా మాట్లాడుతూ ‘‘ఒలింపిక్‌ టైమ్‌ కీపింగ్‌లో కీలక పాత్ర పోషించే ఈ దిగ్గజ బ్రాండ్‌లో భాగమయ్యేందుకు ఉత్సుకతతో ఉన్నా’’ అని పేర్కొన్నాడు. జావెలిన్‌త్రో క్రీడలో ఒలింపిక్‌ పతకం సాధించిన తొలి ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు