ఫిఫా ప్రపంచకప్‌ రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో భారత్ ఓటమి

2026 ఫిఫా ప్రపంచకప్‌ రెండో రౌండ్‌ క్వాలిఫయర్స్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

Published : 21 Nov 2023 21:47 IST

భువనేశ్వర్‌: 2026 ఫిఫా ప్రపంచకప్‌ రెండో రౌండ్‌ క్వాలిఫయర్స్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్‌ వేదికగా ఖతార్‌తో జరిగిన పోరులో 0-3 తేడాతో భారత్‌ పరాజయం పాలైంది. నవంబర్‌ 16న జరిగిన తొలి మ్యాచ్‌లో కువైట్‌ను ఓడించిన భారత్‌ బృందం రెట్టించిన ఉత్సాహంతో ఖతార్‌ను ఢీ కొట్టింది. గట్టి పోటీ తప్పదని అందరూ భావించారు. కానీ, అంచనాలను తలకిందులు చేస్తూ భారత్‌ ఓటమి పాలైంది. వచ్చే ఏడాది మార్చి 26న గువాహటి వేదికగా ఆఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. ప్రపంచకప్‌ ఆసియా క్వాలిఫయర్స్‌ రెండో రౌండ్‌ టోర్నీలో గ్రూప్‌-ఏలో ఖతార్‌, కువైట్‌, అఫ్గానిస్థాన్‌తో భారత్‌ ఆడుతోంది. ప్రతి గ్రూప్‌లో టాప్‌-2 జట్లు మూడో రౌండ్‌ చేరతాయి. అంతేకాదు 2027 ఆసియాకప్‌కు కూడా అర్హత సాధిస్తాయి. ఖతార్‌ ఇప్పటివరకు ఆడిన 2 రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించగా.. భారత్‌ రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు