SA vs IND: దక్షిణాఫ్రికాలో భారత్‌ పర్యటన.. షెడ్యూల్‌, జట్లు, స్ట్రీమింగ్‌ వివరాలు ఇవిగో..

ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా (Team India) దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఆతిథ్య జట్టుతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. 

Updated : 09 Dec 2023 19:27 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓటమి అనంతరం ఆస్ట్రేలియాపై ఐదు టీ20ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుని మంచి ఊపు మీదున్న టీమ్‌ఇండియా (Team India).. ఇప్పుడు దక్షిణాఫ్రికా (South Africa) పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో భారత్.. మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.  సఫారీలతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), స్టార్ ప్లేయర్‌ విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నారు. దీంతో మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను నియమించింది బీసీసీఐ. ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు సారథ్యం వహించిన సూర్యకుమార్‌ యాదవ్.. సఫారీలతో పొట్టి సిరీస్‌కూ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వన్డేల్లో కేఎల్ రాహుల్ (KL Rahul) జట్టును ముందుండి నడిపించనున్నాడు. టెస్టు సిరీస్‌కు రోహిత్‌ శర్మ సారథ్యం వహిస్తాడు. వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కని యుజువేంద్ర చాహల్, సంజూ శాంసన్‌లకు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో అవకాశం కల్పించారు. ఈ మూడు సిరీస్‌ల్లో అన్ని మ్యాచ్‌లను స్టార్‌స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ ప్రత్యక్షప్రసారం చేస్తుంది. డిజిటల్‌లో అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో వీక్షించొచ్చు. 

షెడ్యూల్ ఇలా

టీ20లు 

  • తొలి టీ20 - డిసెంబర్ 10.. కింగ్స్‌మీడ్ స్టేడియం, డర్బన్‌ రాత్రి 7.30 గంటల నుంచి 
  • రెండో టీ20- డిసెంబర్ 12.. సెయింట్ జార్జ్ పార్క్, కెబెరా రాత్రి 8.30 గంటల నుంచి 
  • మూడో టీ20- డిసెంబర్ 14.. న్యూ వాండరర్స్‌ స్టేడియం, జొహన్నెస్‌బర్గ్‌ రాత్రి 8.30 గంటల నుంచి 

వన్డేలు

  • మొదటి వన్డే- డిసెంబరు 17.. న్యూ వాండరర్స్‌ స్టేడియం, జొహన్నెస్‌బర్గ్‌ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 
  • రెండో వన్డే- డిసెంబరు 19.. సెయింట్ జార్జ్ పార్క్, కెబెరా మధ్యాహ్నం 4:30 గంటల నుంచి 
  • మూడో వన్డే- డిసెంబరు 21.. బోలాండ్ పార్క్‌, పాల్ మధ్యాహ్నం 4:30 గంటల నుంచి

టెస్టులు 

  • తొలి టెస్టు- డిసెంబరు 26 నుంచి 30 వరకు.. సూపర్‌స్పోర్ట్ పార్క్‌, సెంచురియాన్‌ మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 
  • రెండో టెస్టు- జనవరి 03 నుంచి 07 వరకు.. న్యూలాండ్స్‌, కేప్‌టౌన్ మధ్యాహ్నం 2:00 గంటల నుంచి 

భారత్ టీ20 జట్టు: 

యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్‌ కెప్టెన్‌), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ , అర్ష్‌దీప్‌ సింగ్, మహ్మద్‌ సిరాజ్, ముకేశ్ కుమార్‌, దీపక్ చాహర్.

దక్షిణాఫ్రికా టీ20 జట్టు: 

ఐడెన్‌ మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), బార్ట్‌మన్, మాథ్యూ బ్రీజ్కీ, నంద్రీ బర్గర్‌, కొయెట్జీ (తొలి రెండు టీ20లకు), డొనొవాన్‌ ఫెరీరా, రిజా హెండ్రిక్స్‌, మార్కో జాన్సన్‌ (తొలి రెండు టీ20లకు), హెన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహరాజ్‌, డేవిడ్ మిల్లర్‌, లుంగి ఎంగిడి (తొలి రెండు టీ20లకు), ఫెలుక్వాయో, షంసి, ట్రిస్టన్‌ స్టబ్స్‌, లిజాడ్‌ విలియమ్స్‌

భారత్‌ వన్డే జట్టు: 

రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్‌), సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్‌ యాదవ్, యుజువేంద్ర చాహల్, ముకేశ్ కుమార్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్‌ సింగ్, దీపక్ చాహర్.

దక్షిణాఫ్రికా వన్డే జట్టు: 

ఐడెన్ మార్‌క్రమ్‌ (కెప్టెన్‌), బార్ట్‌మన్‌, నంద్రీ బర్గర్‌, టోరీ డి జార్జి, రిజా హెండ్రిక్స్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, కేశవ్‌ మహరాజ్‌, మొంగ్వానా, డేవిడ్ మిల్లర్‌, వియాన్‌ ముల్డర్‌, ఫెలుక్వాయో, షంసి, వాండరన్‌ డసెన్‌, కైల్‌ వెరీనె, లిజాడ్‌ విలియమ్స్‌.

భారత్‌ టెస్టు జట్టు: 

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముకేశ్‌ కుమార్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), ప్రసిద్ధ్ కృష్ణ.

దక్షిణాఫ్రికా టెస్టు జట్టు: 

తెంబా బవుమా (కెప్టెన్‌), బెడింగ్‌హామ్‌, నంద్రీ బర్గర్‌, గెరాల్డ్ కొయెట్జీ,  టోనీ డి జార్జి,  డీన్ ఎల్గర్‌, మార్కో జాన్సన్‌, కేశవ్‌ మహరాజ్‌, ఐడెన్ మార్‌క్రమ్‌, వియాన్ ముల్డర్‌, లుంగి ఎంగిడి, కీగన్ పీటర్సన్‌, కగిసో రబాడ, ట్రిస్టన్‌ స్టబ్స్‌, కైల్ వెరీనె.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని