Rohit: : హిట్‌మ్యాన్‌ ఎక్కడైనా రన్స్‌ చేయగలడు:ఇర్ఫాన్‌ పఠాన్‌

భారత బ్యాటింగ్‌పై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పూర్తి పట్టు సాధించాడని భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు.

Published : 26 Jan 2023 17:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ప్రశంసలు కురిపించాడు. ఓపెనర్‌గా రోహిత్‌ తన కెరీర్‌ ప్రారంభించినప్పటి నుంచి భారత బ్యాటింగ్‌పై పూర్తి పట్టు సాధించాడన్నాడు. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా.. ఇలా ఏ జట్టుపైనైనా, ఎక్కడైనా సరే అతడు మంచి స్కోరు సాధించగలడని తెలిపాడు.

‘‘రోహిత్‌ ఓపెనింగ్‌ ప్రారంభించినప్పటి నుంచి భారత బ్యాటింగ్‌పై పూర్తి పట్టు సాధించాడు. గత ఏడాదిన్నర కాలం నుంచి అతడు తన బ్యాటింగ్‌ పద్ధతి మార్చాడు. మంచి యావరేజ్‌, స్ట్రెక్‌రేట్‌తో నిలకడగా రాణిస్తున్నాడు. మూడేళ్ల తర్వాత వన్డేల్లో కివీస్‌పై సెంచరీతో 50 ఓవర్ల క్రికెట్‌లో 10,000 పరుగుల మైలురాయికి చేరుకున్నాడు. దీంతో వన్డేల్లో 30 శతకాలు పూర్తి చేసుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు రికీపాంటింగ్‌తో సమానంగా చేరాడు. ఆస్ట్రేలియాలో ఆడిన మ్యాచుల్లో అతడి సగటు 53. అక్కడ ఐదు సెంచరీలు సాధించాడు. ఇంగ్లాండ్‌లో అతడి సగటు 64. దీన్ని బట్టి అతడు ఎక్కడైనా పరుగులు చేయగలడని అర్థమవుతోంది. ఇక భారత్‌లో అయితే అతడికి తిరుగు లేదు’’ అని పఠాన్‌ పేర్కొన్నాడు.

ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే. కివీస్‌తో రెండో వన్డేలో 51 పరుగులు చేసిన రోహిత్‌ మూడో మ్యాచ్‌లో శతకం (101) బాదాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని