Gill - Ishan: శుభ్‌మన్‌ గిల్‌ వీడియో.. ఇషాన్‌ సూపర్‌ రియాక్షన్‌.. నెట్టింట వైరల్‌!

టీమ్‌ఇండియా యువ ఆటగాళ్లు ఇషాన్‌ కిషన్, శుభ్‌మన్‌ గిల్ మైదానంలోనే కాకుండా వెలుపలా చాలా సరదాగా ఉంటారు. ఈ క్రమంలో గిల్ పెట్టిన వీడియోకు ఇషాన్‌ స్పందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది.

Updated : 17 Jul 2023 16:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గత పదిహేను రోజులుగా టీమ్‌ఇండియా ఆటగాళ్లకు విరామం దొరికింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముగిసినప్పటి నుంచి ఆటగాళ్లు వ్యక్తిగత పర్యటనల్లో ఉన్నారు. జులై 12వ తేదీ నుంచి విండీస్‌తో తలపడనుంది. ఈ క్రమంలో టీమ్ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ ఇటీవల పారిస్‌లోని ఫుట్‌బాల్ క్లబ్‌ను సందర్శించాడు. ఏడో నంబర్‌తో కూడిన జెర్సీని సదరు క్లబ్‌ గిల్‌కు బహూకరించింది. జెర్సీతో కూడిన వీడియోను గిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. అయితే, టీమ్‌ఇండియా మరో యువ బ్యాటర్ ఇషాన్‌ కిషన్‌ స్పందించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది.

గిల్ జెర్సీని ఉద్దేశించి ఇషాన్‌ స్పందిస్తూ.. ‘‘ఆ షర్ట్‌తోనే వెస్టిండీస్‌ పర్యటనకు వచ్చేయ్‌ బ్రదర్. ప్లీజ్‌ మరిచిపోవద్దు. దాని కోసం ప్రతి చోటా వెతికా’’ అని ఇషాన్‌ కిషన్ పోస్టుతోపాటు నవ్వుతున్న ఎమోజీలను పెట్టాడు. గిల్ వీడియోకు రెండు రోజుల్లోపే మిలియన్‌కుపైగా (12.40 లక్షలు) లైకులు వచ్చాయి. 

సచిన్‌, లారా సరదాగా.. 

(ఫొటో: సచిన్‌ ట్విటర్)

క్రికెట్ దిగ్గజాలు సచిన్‌ తెందూల్కర్, లారా మరోసారి నెట్టింట తళుక్కున మెరిశారు. వారిద్దరూ కలిసి విదేశాల్లోని వీధుల్లో కలియతిరిగారు. దీనికి సంబంధించిన ఫొటోలను సచిన్‌ తన ట్విటర్‌లో పోస్టు చేశాడు. ‘‘ఇవాళ మరొక అద్భుతమైన గోల్ఫర్‌ను కలిశాను’’ అని ట్వీట్ చేశాడు. అయితే, వీరిద్దరూ ఎక్కడ ఉన్నారనేది వెల్లడించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని