Jasprit Bumrah: ఒక్క వికెట్టే పడగొట్టినా.. చరిత్ర సృష్టించాడు..

ప్రపంచకప్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఒక్క వికెట్టే పడగొట్టినా.. ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు.

Updated : 03 Nov 2023 13:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకపై 302 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో భారత పేసర్ల ధాటికి లంక.. 55 పరుగులకే కుప్పకూలింది. షమి ఐదు వికెట్లతో మరోసారి సత్తాచాటగా.. మహ్మద్‌ సిరాజ్ 3, జస్‌ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఒకే వికెట్ పడగొట్టినా ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించాడు. వరల్డ్ కప్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన మొదటి భారత బౌలర్‌గా బుమ్రా రికార్డుల్లోకెక్కాడు. శ్రీలంక బ్యాటర్ పాథుమ్ నిశాంకను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపి అతడు ఈ ఘనత అందుకున్నాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని