Sourav Ganguly: కోహ్లీ వల్లే.. ప్రపంచకప్‌ జట్టులోకి అశ్విన్‌: గంగూలీ

దాదాపు నాలుగేళ్ల తర్వాత భారత టీ20 జట్టులోకి మళ్లీ అడుగుపెట్టాడు స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌. 2021 టీ20 ప్రపంచకప్ సమయంలో అతడిని తిరిగి జట్టులోకి తీసుకున్నారు.

Published : 15 Dec 2021 12:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు నాలుగేళ్ల తర్వాత భారత టీ20 జట్టులోకి మళ్లీ అడుగుపెట్టాడు స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌. 2021 టీ20 ప్రపంచకప్ సమయంలో అతడిని తిరిగి జట్టులోకి తీసుకున్నారు. ఆ టోర్నీలో భారత్‌ రాణించకపోయినా అశ్విన్‌ మాత్రం మాయ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సత్తా చాటి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే అశ్విన్‌ను తిరిగి వైట్ బాల్‌ జట్టులోకి తీసుకోవడంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అశ్విన్‌ జట్టులో ఉండాలని విరాట్ కోహ్లీ కోరుకున్నాడని తెలిపారు.

‘‘అశ్విన్‌ మళ్లీ వైట్‌ బాల్‌ జట్టులో ఉంటాడని నేను అనుకోలేదు. కానీ 2021 ప్రపంచకప్‌ సమయంలో అశ్విన్ జట్టులో ఉండాలని అప్పటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కోరుకున్నాడు. అయితే తనకొచ్చిన ఈ అవకాశాన్ని అశ్విన్‌ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. అతడిని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పుడు ప్రతిఒక్కరూ అతడి గురించి మాట్లాడుతున్నారు. కాన్పూర్‌ టెస్టు మ్యాచ్‌ తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ కూడా అశ్విన్‌ను ప్రశంసించాడు. ఆల్‌ టైం గ్రేట్‌ క్రికెటర్‌ అని అన్నాడు. అశ్విన్‌ టాలెంట్‌ను గుర్తించేందుకు రాకెట్ సైన్స్‌ అక్కర్లేదు. అతడి రికార్డులే చెబుతాయి. 2011లో ప్రపంచకప్‌ గెలిచిన భారత్‌ జట్టు, 2013లో ఛాంపియన్‌ ట్రోఫీ గెలిచిన జట్టులో అశ్విన్‌ ఉన్నాడు. ఆ టోర్నమెంట్లలో అతడు లీడింగ్‌ బౌలర్‌ కూడా. ఇటీవల సీఎస్‌కే ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచింది. ఆ జట్టుకు కూడా అతడు ప్రధాన బౌలరే. క్లిష్ట పరిస్థితుల్లో చక్కగా బంతులు విసరగలడు. అలాంటి ఆటగాళ్లను నిర్లక్ష్యం చేయొద్దు’’ అని ఓ చాట్‌షోలో గంగూలీ చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని