Published : 20 May 2022 01:47 IST

Sangakkara-Malinga : ఈ టీమ్‌ఇండియా దిగ్గజంతో బ్యాటింగ్‌ చేయడమంటే ఇష్టం: సంగక్కర

ఇంటర్నెట్ డెస్క్‌: ఆ ఇద్దరూ క్రికెట్‌ లెజెండ్స్.. ఆటపరంగా తమ దేశం కోసం ఎంతో శ్రమించారు. ఇప్పుడు వారిద్దరూ టీ20 లీగ్‌లో రాజస్థాన్‌ జట్టుకు తమ విలువైన సూచనలు, సలహాలు ఇస్తూ నడిపిస్తున్నారు. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. ఆ దిగ్గజ ఆటగాళ్లు ఎవరో.. శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర, లసిత్ మలింగ.. ఒకరేమో బౌలర్లను భయపెడితే.. ఇంకొకరు బ్యాటర్లను హడలెత్తించిన మాజీ క్రికెటర్లు. ప్రస్తుతం సంగక్కర రాజస్థాన్‌ జట్టులో డైరెక్టర్‌ ఆఫ్ క్రికెట్‌ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. మలింగ ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణను రాజస్థాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

లసిత్‌కు  సంగక్కర రాపిడ్ ఫైర్‌ క్వశ్చన్స్‌.. 

* మహేల జయవర్థనె, కుమార సంగక్కరలో ఎవరు నైస్ పర్సన్?

మలింగ: నేను ఫస్ట్‌ టైమ్‌ మహేలను క్లబ్‌ టోర్నమెంట్‌ సందర్భంగా కలిశా. అప్పటికే అతడు పెద్ద ఆటగాడు. ఎలా రిసీవ్‌ చేసుకుంటాడోనని కాస్త సందేహించా. అయితే అతడు బిగ్‌ ప్లేయరే కానీ యువ క్రికెటర్లతో చాలా బాగా ఉంటాడని అర్థమైంది. ఆ తర్వాతే నిన్ను (సంగక్కర) కలిశా. ఇద్దరూ ఒకే మనస్తత్వం కలిగినవారని అర్థమైంది. 

* నువ్వు కాకుండా.. నీ దృష్టిలో అత్యుత్తమ బౌలర్‌ ఎవరు? 

మలింగ: ఫార్మాట్‌ను బట్టి ఒక్కో బౌలర్‌ ఉన్నారు. టెస్టులకు తీసుకుంటే పేసర్‌ అండర్సన్‌ నా దృష్టిలో సూపర్‌ బౌలర్‌. ఇక స్పిన్‌కు వస్తే ముత్తయ్య మురళీ ధరన్‌. (టీ20 ల్లో అయితే వేరే సమాధానం అక్కర్లేదులే అని సంగక్కర అంటాడు)

ఈ క్రమంలో.. నువ్వు ఎవరితో బ్యాటింగ్‌ చేయడానికి ఇష్టపడతావు..? అని కుమార సంగక్కరను లసిత్‌ అడుగుతాడు. దానికి సంగక్కర వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా రాహుల్ ద్రవిడ్‌ పేరును చెబుతాడు. ‘ది వాల్’ అని పిలవడానికి ఓ కారణం ఉంది. ఎలాంటి క్లిష్ట సమయంలోనైనా చక్కగా ఒదిగిపోతాడు. ద్రవిడ్ ఆటతీరు అత్యుత్తమం. 

సంగక్కర: నీ బౌలింగ్‌ యాక్షన్‌కు సంబంధించి ప్రభావితం చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా..?

లసిత్‌: నేను క్రికెట్‌ను కెరీర్‌ను ఎంచుకున్న తర్వాత నా బౌలింగ్‌ యాక్షన్‌ను చూసి చాలామంది ఎంత కాలం ఉంటాడు..? మహా ఉంటే ఓ ఆరు నెలలు.. అంతకంటే రాణించలేడు అనే మాటలు వచ్చాయి. ఇటువంటి బౌలింగ్‌ యాక్షన్‌తో ఎక్కువ కాలం ఆడటం చాలా కష్టం అనేది చాలా మంది భావన. ఇంకోక తమాషా ఏంటంటే.. నేను బంతిని త్రో చేస్తాననే మాటలు కూడా వినిపించాయి.

సంగక్కర: సచిన్‌ తెందూల్కర్‌తో నీ మధుర జ్ఞాపకం ఏంటి?

లసిత్‌: 2009లో టీ20 లీగ్‌ తొలిసారి ఆడినప్పుడు నేను రెండో బంతికే నా మొదటి వికెట్‌ను తీశాను. పార్థివ్‌ పటేల్‌ వికెట్‌ను పడగొట్టా. స్లిప్‌లో సచిన్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. అదే సచిన్‌తో అత్యద్భుతమైన మధుర జ్ఞాపకం.

సంగక్కర: అసలు నువ్వు చూడటానికి క్రికెటర్‌లానే కనిపించవు. ఆ హెయిట్‌ స్టైల్‌ ఏంటి..? జుట్టు కలర్‌ ఏంటి? మొదట్లో అనుకున్నా.. ఓ యంగ్‌ ప్లేయర్‌ ఇలా ఉండటం ఫస్ట్‌ టైమ్‌ చూశా.. అదే కాన్ఫిడెంట్‌... ‘నేను మారను.. ఇలానే ఉంటా..’ కెరీర్‌ మొత్తం కూడా నీదైన స్టైల్‌తోనే ఉన్నావు. అది సరే ఒకవేళ హెయిర్‌ స్టైల్‌ను మార్చాలంటే ఎలా మారతావు? 

లసిత్‌: నో. నేనైతే దాని గురించి ఆలోచించలేదు. నా కొత్త ప్రయాణం ముగిసేవరకు హెయిర్‌స్టైల్‌ జోలికే పోను. అసలు మార్చాలనే ఆలోచనే లేదు. హెట్‌మయేర్‌ చేసినట్లు నేను చేయను.

సంగక్కర: కానీ ఈసారి రాజస్థాన్‌ టీమ్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ ఎటాక్‌ ఎలా ఉంది..?

లసిత్‌: చాలా బాగుంది. ఎందుకంటే వారందరికీ అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉంది. అంతేకాకుండా 140 కి.మీపైగా వేగంతో బౌలింగ్‌ చేసే ఐదారుగురు బౌలర్లు మనకు ఉండటం కలిసొచ్చే అంశం.

సంగక్కర, మలింగ మధ్య ఇలాంటి సరదా ప్రశ్నలు-సమాధానాలు మరెన్నో ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోను చూసేయండి.. 


Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts