Mohammed Shami: నా కుమార్తెతో మాట్లాడనివ్వడం లేదు.. మహమ్మద్‌ షమీ ఆవేదన

కుమార్తె ఐరాను ఎంతగానో మిస్‌ అవుతున్నానని, తనతో చాలా తక్కువగా మాట్లాడాల్సి వస్తోందని భారత పేస్‌ బౌలర్‌ మహమ్మద్‌ షమీ ఆవేదన వ్యక్తంచేశాడు. 

Updated : 09 Feb 2024 16:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత క్రికెటర్‌ మహమ్మద్‌ షమీ (Mohammed Shami) తన కుమార్తె ఐరాను కలుసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశాడు. విభేదాల వల్ల కొన్నాళ్లుగా షమీ తన భార్య హసిన్‌ జహాన్‌కు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కుమార్తెను చూడటానికి, మాట్లాడటానికి తనను అనుమతించడం లేదని, కొన్ని సందర్భాల్లో మాత్రమే మాట్లాడుతున్నానని తెలిపాడు. మహమ్మద్‌ షమీ, హసిన్‌ జహాన్‌కు 2014లో వివాహం కాగా 2015లో ఐరా జన్మించింది. తరువాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వారు విడిపోయారు. 

‘‘ఎవరూ తన కుటుంబాన్ని, పిల్లలను కోల్పోవాలనుకోరు. కానీ కొన్ని పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. తనను చాలా మిస్‌ అవుతున్నా.’’ అని షమీ అన్నాడు. ‘‘తను (హసిన్‌ జహాన్‌) అనుమతిస్తేనే నేను ఐరాతో మాట్లాడగలను. నా కుమార్తె నాతో మాట్లాడటం ఆమెపై ఆధారపడి ఉంది. చాలారోజుల నుంచి నేను తనను చూడలేదు. తాను ఆరోగ్యంగా ఉంటూ అన్నింటిలో విజయం సాధించాలని కోరుకుంటున్నా. హసిన్‌కు నాకు మధ్య జరిగే వివాదం మావరకు మాత్రమే. అక్కడ ఐరా సంతోషంగా ఉంటోందని అనుకుంటున్నా’’ అని షమీ అన్నాడు. 

కాగా గతేడాది వన్డే ప్రపంచకప్‌ ముగిసినప్పటి నుంచి షమీ ఆటకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లకు, దక్షిణాఫ్రికా పర్యటనలోనూ ఆడలేదు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో మొదటి రెండు టెస్టులకు ఈ పేసర్‌ అందుబాటులో లేడు. చీలమండ గాయంతో చికిత్స కోసం షమీ ఇంగ్లాండులో ఉన్నాడు. మరోవైపు రవీంద్ర జడేజా మిగిలిన మూడు మ్యాచ్‌లకు జట్టులో చేరే అవకాశాలు లేవు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు