MI vs RCB: డబ్ల్యూపీఎల్‌ ఫైనల్‌కు ఎవరో.. టాస్‌ నెగ్గిన బెంగళూరు

డబ్ల్యూపీఎల్‌ సీజన్‌-2లో ఎలిమినేటర్‌ సమరానికి అంతా సిద్ధమైంది.

Updated : 15 Mar 2024 19:21 IST

దిల్లీ: డబ్ల్యూపీఎల్‌ సీజన్‌-2లో ఎలిమినేటర్‌ సమరానికి అంతా సిద్ధమైంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య కాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్‌ నెగ్గిన బెంగళూరు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం దిల్లీ క్యాపిటల్స్‌తో ఫైనల్లో తలపడనుంది.

బెంగళూరు: స్మృతి మంధాన (కెప్టెన్‌), సోఫీ మోలినెక్స్‌, ఎలీస్‌ పెర్రీ, సోఫీ డివైన్‌, రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), జార్జియా వేర్‌హామ్‌, దిశా కసత్‌, శ్రేయంకా పాటిల్‌, ఆశా శోభన, శ్రద్ధా, రేణుకా ఠాకూర్‌.

ముంబయి: హేలీ మ్యాథ్యూస్‌, యస్తికా భాటియా (వికెట్‌ కీపర్‌), నాట్‌ సీవర్‌ బ్రంట్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), అమేలీ కేర్‌, అమంజోత్‌ కౌర్‌, పూజా వస్త్రాకర్‌, సజనా, హుమైరా ఖాజీ, షబ్నిమ్‌, సైకా ఇషాక్‌

బలాలు ఇవీ..

తన చివరి మ్యాచ్‌లో ముంబయిని ఓడించి ప్లేఆఫ్స్‌ చేరిన బెంగళూరు.. ఎలిమినేటర్‌లోనూ ఇదే స్ఫూర్తితో ఆడాలనే పట్టుదలతో ఉంది. ముంబయితో గత మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఎలీస్‌ పెర్రీపై ఆర్సీబీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఫామ్‌లో ఉన్న రిచా ఘోష్‌, కెప్టెన్‌ స్మృతి మంధాన, సోఫీ డివైన్‌ రాణించడం కూడా ఆ జట్టుకు కీలకం. మరోవైపు తన చివరి లీగ్‌ పోరులో బెంగళూరు చేతిలో ఓడినా ముంబయిని తక్కువ అంచనా వేయలేం. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ఆ జట్టు.. ఈ సీజన్లో 5 మ్యాచ్‌ల్లో గెలిచి మూడింట్లో ఓడింది. కలిసికట్టుగా రాణించడం ముంబయి బలం. హర్మన్‌ప్రీత్‌ కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటుతూ ముంబయికి అండగా ఉంటోంది. నాట్‌ సీవర్‌, అమేలీ కెర్‌ రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. ఆర్సీబీతో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ముంబయి గెలుపోటముల రికార్డు 3-1గా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని