Asia Cup : హార్దిక్ కాదా..! రోహిత్ శర్మ డిప్యూటీగా ఛాన్స్ ఎవరికి..?
ఆసియా కప్(Asia Cup 2023) కోసం జట్టును ఎంపిక చేసే ప్రక్రియలో టీమ్‌ఇండియా నిమగ్నమైంది. ఇందుకోసం సెలక్షన్ కమిటీ సోమవారం దిల్లీలో సమావేశం కాబోతోంది.
ఇంటర్నెట్ డెస్క్ : ఈ నెల 30 నుంచి జరగబోయే ఆసియా కప్ టోర్నీకి జట్టును ప్రకటించేందుకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఇందుకోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం దిల్లీలో సమావేశం కాబోతోంది. వన్డే ప్రపంచకప్ టోర్నీకి కూడా ఇదే జట్టును కొనసాగించే అవకాశం ఉండటంతో.. ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం ఆసక్తిగా మారింది. మరోవైపు రోహిత్ సారథిగా ఉండే జట్టుకు వైస్ కెప్టెన్ ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది.
వైస్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యకు అవకాశం ఇవ్వకపోవచ్చని.. మరొకరిని ఎంపిక చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు చెపట్టి.. తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసి తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్న స్టార్ పేసర్ బుమ్రా వైస్ కెప్టెన్‌కు బలమైన పోటీదారు అని పలువురు పేర్కొంటున్నారు.
వరుస రోజుల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తే సెక్యూరిటీ కష్టమే.. HYD పోలీసుల ఆందోళన!
‘కెప్టెన్సీ విషయంలో సీనియారిటీ పరంగా చూస్తే.. పాండ్యా కంటే బుమ్రానే ముందున్నాడు. 2022లోనే టెస్టు జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. పాండ్యకు ముందు దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డేల్లో వైస్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఈ కారణంగా ఆసియా కప్‌తోపాటు ప్రపంచ కప్‌నకు బుమ్రా.. రోహిత్ డిప్యూటీగా ఎంపికైతే ఆశ్చర్యపోనవసరం లేదు. ఐర్లాండ్ పర్యటనలో రుతురాజ్‌కు బదులు అతడిని కెప్టెన్‌గా నియమించడానికీ కారణం ఉంది’ అని పేరుచెప్పడానికి ఇష్టపడని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించాడు.
ఇక పాండ్య నేతృత్వంలో ఇటీవల ముగిసిన విండీస్ టూర్‌లో టీమ్‌ఇండియా టీ20 సిరీస్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో అతడు జట్టును నడిపించిన తీరుపై విమర్శలు చెలరేగాయి.
ఇదిలా ఉండగా.. ఆసియా కప్‌నకు అదనంగా ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేస్తారని వార్తలొస్తున్నాయి. మామూలుగా ద్వైపాక్షిక సిరీస్‌లకైనా, ఏదైనా టోర్నీలకైనా 15 మంది సభ్యులతో జట్టును ఎంపిక చేస్తారు. కానీ ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆసియా కప్‌లో ఎక్కువ మంది ఆటగాళ్లను పరీక్షించాలన్న ఉద్దేశంతో ఈ టోర్నీకి 17 మందిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Gandhi Jayanti: మహాత్ముడి బోధనలు.. మన మార్గాన్ని వెలిగించాయి: గాంధీజీకి ప్రముఖుల నివాళి
-
Trudeau- Elon Musk: ట్రూడో మీకిది సిగ్గుచేటు.. విరుచుకుపడ్డ ఎలాన్ మస్క్
-
Upcoming Movies: ఈ వారం థియేటర్లో చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీ చిత్రాలివే!
-
Art of living: వాషింగ్టన్ డీసీలో మార్మోగిన శాంతి మంత్రం
-
NIA Raids: తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
-
Eluru: యువకుడి చేతిలో దాడికి గురైన కానిస్టేబుల్ మృతి