పీసీబీకి జ్ఞానోదయం: దిగ్గజాలకు గౌరవం

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయ్యింది. తమ దిగ్గజ ఆటగాళ్లను గౌరవించేందుకు ఆదివారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ మాదిరిగా సొంతంగా ‘పీసీబీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ పేరిట పాక్ క్రికెట్‌లో...

Published : 12 Apr 2021 01:29 IST

(Photo: PCB Twitter)

కరాచి: పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు ఇన్నాళ్లకు జ్ఞానోదయమైంది. తమ దిగ్గజ ఆటగాళ్లను గౌరవించేందుకు ఆదివారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ మాదిరిగా సొంతంగా ‘పీసీబీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ పేరిట పాక్ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు సాధించిన మాజీలను సత్కరించే కొత్తగా నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా తొలిసారి ప్రవేశపెడుతున్న ఈ కార్యక్రమంలో ఆరుగురు దిగ్గజాలను ఎంపిక చేసింది.

అందులో పాక్‌ ప్రధాని, మాజీ సారథి ఇమ్రాన్‌ ఖాన్‌ ఉండటం విశేషం. అలాగే హనీఫ్‌ మహ్మద్‌, జావెద్‌ మియాందాద్‌‌, వసీమ్‌ అక్రమ్‌, వకార్‌ యూనిస్‌, జహీర్‌ అబ్బాస్‌ లాంటి గొప్ప ఆటగాళ్లను కూడా పీసీబీ హాల్‌ ఫేమ్‌ క్రికెటర్లుగా ఎంపిక చేసింది. 2021 నుంచి ఏటా అక్టోబర్‌ 16న ముగ్గురు క్రికెటర్లను ఈ గౌరవార్ధం కోసం ఎంపిక చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఇందులో అర్హత సాధించాలంటే ఆయా ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించి ఐదేళ్లు పూర్తిచేసి ఉండాలని పీసీబీ చీఫ్ ఎహ్‌సన్‌ మణి పేర్కొన్నారు.

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు టెస్టు  పలువురు మేటి క్రికెటర్లను తీర్చిదిద్దిందని, వారు ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేక గుర్తింపు సాధించారని మణి చెప్పుకొచ్చారు. తొలిసారి ప్రవేశపెడుతున్న ఈ కార్యక్రమంలో ఆరుగురు దిగ్గజాలను ఎంపిక చేయడం సరైన నిర్ణయమని చెప్పాడు. వీరు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని పీసీబీ చీఫ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని