IND vs NZ: వాళ్ల ప్రశంసలు జీవితాంతం గుర్తుంటాయి: అజాజ్‌ పటేల్‌

టీమ్‌ఇండియా కొత్త కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌, కెప్టెన్‌ విరాట్ కోహ్లి.. తమ డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వచ్చి ప్రశంసించడం మరిచిపోలేని అనుభూతి అని న్యూజిలాండ్ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ అన్నాడు...

Published : 09 Dec 2021 01:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా కొత్త కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌, కెప్టెన్‌ విరాట్ కోహ్లి.. తమ డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వచ్చి ప్రశంసించడం మరిచిపోలేని అనుభూతి అని న్యూజిలాండ్ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ అన్నాడు. టీమ్‌ఇండియా ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తిని చాటారని పేర్కొన్నాడు. ఇటీవల ముంబయి వేదికగా జరిగిన రెండో టెస్టులో అజాజ్‌ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. 

‘ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసి.. జిమ్‌ లేకర్‌, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజ బౌలర్ల సరసన నిలిచినందుకు సంతోషంగా ఉంది. వాంఖడే మైదానంలో క్రికెట్ ఆడితే చాలు అనుకున్న నేను.. పురిటి గడ్డపై ఇంత గొప్ప రికార్డు సాధించినందుకు చాలా గర్వపడుతున్నాను. దాంతో పాటు టీమ్‌ఇండియా ఆటగాళ్లు మా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వచ్చి ప్రశంసించడం మరిచిపోలేని అనుభూతి. రాహుల్‌ ద్రవిడ్ ఎంత గొప్ప ఆటగాడో మనందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి నన్ను మెచ్చుకోవడం జీవితాంతం గుర్తుంటుంది. కెప్టెన్‌ విరాట్ కోహ్లి, మహమ్మద్‌ సిరాజ్‌లిద్దరూ నన్ను అభినందించారు. సీనియర్‌ స్పిన్నర్‌  రవిచంద్రన్‌ అశ్విన్‌.. టీమ్‌ఇండియా ఆటగాళ్ల సంతకాలతో కూడిన జెర్సీని అందించడం, నా ఇంటర్య్యూ తీసుకోవడం చాలా గొప్పగా అనిపించింది. మొత్తంగా టీమ్‌ఇండియా ఆటగాళ్ల క్రీడాస్ఫూర్తి నన్ను కట్టి పడేసింది’ అని అజాజ్‌ పటేల్ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు