Ravi Shastri: రవిశాస్త్రితో కలిసి పని చేయడం నా అదృష్టం : మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్

టీమ్ఇండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రితో కలిసి పని చేయడం తన అదృష్టమని మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ అన్నాడు. అతడి నేతృత్వంలో టీమ్‌ఇండియా ఎన్నో మరుపురాని విజయాలు..

Published : 11 Dec 2021 14:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్ఇండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రితో కలిసి పని చేయడం తన అదృష్టమని మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ అన్నాడు. అతడి నేతృత్వంలో టీమ్‌ఇండియా ఎన్నో మరుపురాని విజయాలు సాధించిందని ప్రశంసించాడు. భారత సీనియర్‌ క్రికెట్ జట్టుకు ఏడు సంవత్సరాలు ఫీల్డింగ్‌ కోచ్‌గా పని చేసిన భరత్‌ ఇటీవల ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. అతడి స్థానంలో హైదరాబాద్‌కు చెందిన టీకే దిలిప్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

‘రవిశాస్త్రి లాంటి దిగ్గజ ఆటగాడితో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టం. అతడితో సన్నిహితంగా పని చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆటగాళ్లకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ మానసికంగా, ఆటపరంగా చాలా సహాయంగా ఉండేవాడు. ఆటగాళ్లకు ఎల్లప్పుడూ అండగా నిలిచేవాడు. జట్టుకోసం అత్యుత్తమ నిర్ణయాలు తీసుకునే సమయంలో కోచ్‌ల మధ్య భేదాభిప్రాయాలు రావడం సహజమే. మనం తీసుకున్న నిర్ణయం పట్ల ఒకరు అంగీకారం తెలుపవచ్చు. మరోకరు ఒప్పుకోకపోవచ్చు. అది రవిశాస్త్రి, సంజయ్‌ బంగర్‌, విక్రమ్‌ రాఠోడ్ ఇలా ఎవరైనా కావొచ్చు. అయితే, చివరికి వాళ్లంతా పని చేసేది ఒక జట్టు కోసమే. వారి ప్రయత్నమంతా టీమ్‌ఇండియా విజయం కోసమే. అందుకే, రవిశాస్త్రి ఎప్పుడూ తన నాయకత్వ లక్షణాలతో అందరినీ కలుపుకొనిపోయేవాడు. అతనో గొప్ప నాయకుడు’ అని శ్రీధర్‌ పేర్కొన్నాడు. 

నాలుగు సంవత్సరాలు టీమ్‌ఇండియా సీనియర్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా పని చేసిన రవిశాస్త్రి పదవీ కాలం.. టీ20 ప్రపంచకప్‌తో ముగిసింది. అతడి తర్వాత భారత మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్‌ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని